ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BSNL: బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్ ఇదీ.. రోజుకు ఏకంగా 3 జీబీ డేటా..

ABN, First Publish Date - 2023-03-07T19:52:49+05:30

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 455 రోజుల కాలపరిమితి, రోజుకు 3జీబీ డేటా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 455 రోజుల కాలపరిమితి, రోజుకు 3జీబీ డేటా అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్(Prepaid Plan) గురించి మీకు తెలుసా? సుదీర్ఘ కాలపరిమితి, డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరం. ఈ ప్లాన్ ధర రూ. 2,998. దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంది. ఇందులో రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతో పైన పేర్కొన్న ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ప్లాన్‌కు వినియోగదారులు ఖర్చు చేసేది రోజుకు రూ. 6.59 మాత్రమే.

దీర్ఘకాల వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ చక్కని ఆప్షన్ అవుతుంది. అయితే, బీఎస్ఎన్‌తో వచ్చిన చిక్కంతా నాసిరకం టెక్నాలజీ, కవరేజీ సరిగ్గా లేకపోవడమే. మిగతా ప్రైవేట్ టెల్కోలన్నీ రీసెర్చ్ మీద బోల్డంత ఇన్వెస్ట్ చేస్తుంటే బీఎస్ఎన్‌ఎల్ మాత్రం ఇంకా పాతకాలం టెక్నాలజీనే వాడుతోంది. ఫలితంగా ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోలేకపోతోంది.

త్వరలోనే 4జీ

ప్రైవేట్ టెల్కోలన్నీ 5జీ సేవలను అందుబటులోకి తీసుకొచ్చినప్పటికీ బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3జీ సేవలతోనే సరిపెడుతోంది. అయితే, ఇప్పుడు 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చే పనిలో బిజీగా ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(TCS) తో కలిసి 4జీ సేవల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. 3జీ, 4జీ నెట్‌వర్క్ కవరేజీలో ఉన్న బీఎస్‌ఎన్ఎల్ వినియోగదారులకు రూ. 2,998 ప్లాన్ చక్కని ఆప్షన్ అవుతుంది. 4జీ సేవలు కనుక అందుబాటులోకి వస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్లకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, వాటి ధర కూడా పెరుగుతుంది. దేశంలోని మరే ఇతర టెలికం కంపెనీ కూడా 455 రోజుల కాలపరిమితితో ఎలాంటి ప్లాన్లు అందించడం లేదు.

Updated Date - 2023-03-07T19:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising