ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CEA Anantha Nageswaran: ‘కనీస ఆదాయ హామీ’ మనకు పనికిరాదు..!

ABN, First Publish Date - 2023-06-10T01:35:18+05:30

ప్రతి పౌరుడికి కనీస ఆదాయానికి హామీ ఇచ్చే సార్వత్రిక సామాజిక భద్రత (యూఎ్‌సఎస్‌) ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ తిరస్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతికూల ప్రభావానికే ఎక్కువ అవకాశం

సీఈఏ అనంత నాగేశ్వరన్‌

లఖ్‌నవూ: ప్రతి పౌరుడికి కనీస ఆదాయానికి హామీ ఇచ్చే సార్వత్రిక సామాజిక భద్రత (యూఎ్‌సఎస్‌) ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ తిరస్కరించారు. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది పనికి రాదన్నారు. దీనివల్ల ప్రతికూల ప్రభావాలకే ఎక్కువ అవకాశం ఉందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన ఒక సదస్సులో స్పష్టం చేశారు. అంతేకాకుండా దీనివల్ల ప్రజలు కూడా సోమరిపోతులుగా మారే ప్రమాదం ఉందన్నారు. సుస్థిర జీడీపీ వృద్ధి ద్వారా ప్రజల ఆదాయాలు పెంచడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమన్నారు. అయితే అట్టడుగు వర్గాలకు ఒక స్థాయి వరకు చేయూత ఇవ్వడంలో మాత్రం తప్పు లేదన్నారు.

ఏఐపై జర జాగ్రత్త

కృత్రిమ మేధ (ఏఐ)పై భారత ఐటీ పరిశ్రమ అప్రమత్తంగా ఉండాలని సీఈఏ హెచ్చరించారు. దీనివల్ల ఐటీ పరిశ్రమలో అనేక మంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం కూడా ఉందన్నారు. అదే జరిగితే భారత ఐటీ ఎగుమతులకూ ముప్పు ఏర్ప డే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ఐటీ పరిశ్రమ ముందే జాగ్రత్త పడాలని సూచించారు.

భవిష్యత్‌ భేష్‌

మధ్యకాలికంగా చూస్తే భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని నాగేశ్వరన్‌ అన్నారు. తగ్గుతున్న ద్రవ్యోల్యణం, ద్రవ్య లోటు, పెరుగుతున్న వినియోగం, మూలధన పెట్టుబడులు, పంటల దిగుబడులు ఈ విషయంలో భారత ఆర్థిక వ్యవస్థకు కలిసొస్తాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ భారత జీడీపీ 6.5 శాతం నుంచి 7 శాతం వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందన్నారు.

మాదీ అదే మాట : ఎస్‌బీఐ

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) కూడా ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను 6.4 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. ఎకోరాప్‌ రీసెర్చ్‌ రిపోర్టు పేరుతో శుక్రవారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం పేర్కొంది. గురువారం ప్రకటించిన ద్రవ్య, పరపతి విధానంలో ఆర్‌బీఐ కూడా 2023-24 జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 6.4 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. గ్రామీణ డిమాండ్‌ ఇంకా అంతంత మాత్రంగానే ఉన్నా, పట్టణ ప్రాంతాల డిమాండ్‌ కొవిడ్‌కు ముందున్న స్థాయిని మించిపోవడం ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీకి బాగా కలిసొచ్చే అంశమని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది.

Updated Date - 2023-06-10T01:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising