MEIL Refinery : మంగోలియాలో ఎంఈఐఎల్ రిఫైనరీ నిర్మాణం
ABN, First Publish Date - 2023-09-30T04:53:36+05:30
మంగోలియాలో అత్యాధునిక చమురు రిఫైనరీ నిర్మించడానికి హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
కాంట్రాక్ట్ విలువ రూ.5,400 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మంగోలియాలో అత్యాధునిక చమురు రిఫైనరీ నిర్మించడానికి హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్)కు 64.8 కోట్ల డాలర్ల (దాదాపు రూ.5,400 కోట్లు) విలువైన కాంట్రాక్టు లభించింది. ఈ మేరకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎల్‌ఓఏ)ను పొందినట్లు ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఒప్పందంపై ఎంఈఐఎల్ హైడ్రోకార్బన్స్ ప్రెసిడెంట్ పీ రాజేశ్ రెడ్డి, మంగోల్ రిఫైనరీ స్టేట్ ఓన్డ్ ఎల్‌ఎల్‌సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్టాన్‌సెట్‌సెగ్ సంతకాలు చేశా రు. మంగోలియాలో ఎంఈఐఎల్‌కు ఇది మూడో ప్రాజెక్టు అవుతుంది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎంఈఐఎల్ అంతర్జాతీయ హైడ్రోకార్బన్ రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందిందని.. ఈ రంగంలోని అన్ని విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని అన్నారు. కొత్త రిఫైనరీ నిర్మాణంలో భాగంగా ఎంఈఐఎల్ డీజిల్ హైడ్రోట్రీటర్ యూని ట్, హైడ్రోక్రాకర్ యూనిట్, హైడ్రోజన్ జనరేషన్ యూనిట్, సల్ఫర్ బ్లాక్ మొదలైన వాటిని నిర్మిస్తుం ది. గతంలో మంగోలియాలో మొదటి రిఫైనరీ నిర్మా ణం కాంట్రాక్టు ఎంఈఐఎల్‌కు దక్కింది. క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను కూడా నిర్మించే కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పటి వరకూ దక్కించుకున్న మొత్తం కాంట్రాక్టుల విలువ 1.436 బిలియన్ డాలర్లని కంపె నీ వెల్లడించింది. కాగా మంగోలియా ఇప్పటి వరకూ రష్యా నుంచి దిగుమతి అయ్యే చమురు ఉత్పత్తులపై ఆధారపడుతోంది. ఎంఈఐఎల్ నిర్మించే రిఫైనరీ ప్రాజెక్టుల వల్ల ఈ పరిస్థితి మారుతుంది. ఇంధన సెక్యూరిటీ పెరుగుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల్లో వచ్చే ఒడుదొడుకుల నుంచి మంగోలియా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది. ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. రిఫైనరీకి సంబంధించి అనేక చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయని కృష్ణారెడ్డి తెలిపారు. మంగోలియా లో రిఫైనరీ నిర్మించడం ఒక సవాల్ అనీ.. ఇక్కడ మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రత మారుతుందని చెప్పారు.
్చ్చ
Updated Date - 2023-09-30T04:53:36+05:30 IST