EPFO: పీఎఫ్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా.. ఇలా చేయండి అమౌంట్ ఈజీగా బదిలీ అవుతుంది
ABN, First Publish Date - 2023-11-23T17:01:36+05:30
పని చేస్తున్న సంస్థలు మారితే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా తప్పనిసరిగా చేసుకోవాలి. లేదా డబ్బులు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. డబ్బులు ఫ్రీజ్ అయితే రన్నింగ్ అకౌంట్ లోకి ఎలా మార్చాలి.. పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి ...
ఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ అకౌంట్(PF Account) గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగి నెలవారీ జీతం నుంచి కొంత మొత్తంలో కట్ అవుతుంది. అలాగే కంపెనీ నుంచి కూడా కొంత అమౌంట్ ఉద్యోగి ఖాతాకు బదిలీ అవుతుంది.
అయితే పని చేస్తున్న సంస్థలు మారితే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా తప్పనిసరిగా చేసుకోవాలి. లేదా డబ్బులు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. డబ్బులు ఫ్రీజ్ అయితే రన్నింగ్ అకౌంట్ లోకి ఎలా మార్చాలి.. పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం..
విత్ డ్రా చేసుకోండిలా...
ఈపీఎఫ్‌వో ఈ - సర్వీస్ పోర్టల్ లోకి లాగిన్ కావాలి
యూఏఎన్, పాస్ వర్డ్ ఎంటర్ చేయండి
ఆన్ లైన్ సర్వీస్ పై క్లిక్ చేయండి
ఫారం 31 నుంచి క్లెమ్ చేయండి
బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని నిర్ధారించండి
డబ్బులు ఎందుకు విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారో కారణం చెప్పండి
ఫైనల్ గా విత్ డ్రా చేయడానికి కావాల్సిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయండి
ఫారం 13 గురించి..
EPFO వెబ్‌సైట్ ప్రకారం, ఒక కంపెనీని విడిచిపెట్టి మరొక కంపెనీలో చేరిన ఉద్యోగి EPF డబ్బును బదిలీ చేయడానికి ఫారం 13 ను సమర్పించాలి. ఉద్యోగులు మునుపటి ఉద్యోగం నుండి వచ్చిన ఈపీఎఫ్‌ని క్లెయిమ్ చేయడానికి మిశ్రమ(Composite Claim Form) క్లెయిమ్ ఫారమ్‌ను సమర్పించాలి.
Updated Date - 2023-11-23T17:01:38+05:30 IST