18000 వద్ద పరీక్ష
ABN, First Publish Date - 2023-02-06T01:33:42+05:30
నిఫ్టీ గత సోమవారం బలహీనంగానే ప్రారంభమైనా ప్రధాన మద్దతు స్థాయి 17500 వద్ద కోలుకుంది. కాని కీలక స్థాయి 18000 వద్ద మరోసారి విఫలం కావడంతో తక్షణ అప్‌ట్రెండ్‌ను...
టెక్ వ్యూ
నిఫ్టీ గత సోమవారం బలహీనంగానే ప్రారంభమైనా ప్రధాన మద్దతు స్థాయి 17500 వద్ద కోలుకుంది. కాని కీలక స్థాయి 18000 వద్ద మరోసారి విఫలం కావడంతో తక్షణ అప్‌ట్రెండ్‌ను సూచించలేకపోయింది. కాని 250 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయి 17850 చేరువలో క్లోజైంది. అయినా నెలవారీ చార్టుల్లో 18000 కన్నా దిగువన బలహీనంగా క్లోజ్ కావడం స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగవచ్చనేందుకు లేదా కన్సాలిడేట్ కావచ్చనేందుకు సంకేతం. కేవలం టెక్నికల్ ఓవర్‌సోల్డ్ స్థితి వల్లనే మైనర్ పుల్‌బ్యాక్ ఏర్పడింది. ప్రధాన స్వల్పకాలిక ట్రెండ్ బలహీనంగానే ఉంది.
బుల్లిష్ స్థాయిలు : తదుపరి దిశ తీసుకునే ముందు స్వల్పకాలిక కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. మరింత అప్‌ట్రెండ్ కోసం నిఫ్టీ ప్రధాన నిరోధం 18000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 18250.
బేరిష్ స్థాయిలు: 18000 వద్ద విఫలమైతే మరింత బలహీనత ఉండవచ్చని సంకేతాలిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 17700, 17500. కరెక్షన్‌కు లోనైనా సానుకూలత కోసం 17500 కన్నా పైన తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత తప్పదు.
బ్యాంక్ నిఫ్టీ: గతవారం ఈ సూచీ కనిష్ఠ స్థాయి 39500 వద్ద మంచి రికవరీ సాధించి 1150 పాయింట్ల లాభంతో 41500 వద్ద ముగిసింది. మరింత అప్‌ట్రెండ్ కోసం ప్రధాన నిరోధం 42000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన మద్దతుస్థాయి 40600 కన్నా దిగజారితే మరింత అప్రమత్తం కావాలి.
పాటర్న్: గత వారం మార్కెట్ 50, 100 డిఎంఏల వద్ద విఫలమైంది. సానుకూలత కోసం ఈ స్థాయిల కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం200 డిఎంఏ కన్నా స్వల్పంగా పైన ఉంది. 18250 వద్ద రెండు ప్రధాన టాప్‌లను కలుపుతూ ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిరోధం ఉంది. ప్రస్తుతం అది కొంతదూరంగా ఉంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు. అలాగే గతవారం బాటమ్ ఏర్పడినట్టు సూచీ సూచిస్తోంది.
సోమవారం స్థాయిలు
నిరోధం : 17920, 18000
మద్దతు : 17760, 17700
వి. సుందర్ రాజా
Updated Date - 2023-02-06T01:33:48+05:30 IST