ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకిటరమణన్ ఇక లేరు
ABN, First Publish Date - 2023-11-19T05:35:22+05:30
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ వెంకిటరమణన్ అనారోగ్యంతో శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు....
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ వెంకిటరమణన్ అనారోగ్యంతో శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు. వేగంగా నిర్ణయాలు తీసుకోగలరని పేరున్న వెంకిటరమణన్.. ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించడంతోపాటు పలు సంక్షోభాలను చాకచక్యంగా పరిష్కరించగలిగారు. ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే (1990-92) భారత్ ఆర్థికంగా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో కీలకపాత్ర పోషించారు. ఆర్‌బీఐ గవర్నర్ కంటే ముందు ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా, కర్ణాటక ప్రభుత్వ సలహాదారుగానూ పనిచేశారు. ఆయన మరణం పట్ల ఆర్‌బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ సహా పలువులు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-11-19T05:35:24+05:30 IST