Gold Rate Today: ఏప్రిల్ 10 కూడా వచ్చేసింది.. ఇవాళ బంగారం ధర పరిస్థితి అయితే ఇది..!
ABN, First Publish Date - 2023-04-10T10:06:53+05:30
కాలచక్రం యమా స్పీడ్‌గా తిరిగేస్తోంది. ఏప్రిల్ నెలలో 10వ తేదీ కూడా వచ్చేసింది. ఈ నెల ఆరంభంలోనే రూ.60 వేలు దాటేసిన తులం బంగారం ధర (Gold Rate Today).. ఏప్రిల్ 10 నాటికి..
కాలచక్రం యమా స్పీడ్‌గా తిరిగేస్తోంది. ఏప్రిల్ నెలలో 10వ తేదీ కూడా వచ్చేసింది. ఈ నెల ఆరంభంలోనే రూ.60 వేలు దాటేసిన తులం బంగారం ధర (Gold Rate Today).. ఏప్రిల్ 10 నాటికి 60,860 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధరలు (24K Gold Price) ఇలా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర (22K Gold Price) కూడా ఏప్రిల్ 1తో పోల్చితే బాగానే పెరిగింది. ఏప్రిల్ 1న 22 క్యారెట్ల బంగారం ధర 55,000 రూపాయలు ఉండగా.. ఏప్రిల్ 10 నాటికి 55,790 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర పది రోజుల్లో తులంపై 790 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఈ పది రోజుల్లో 860 రూపాయలు పెరగడం గమనార్హం.
ఆదివారంతో పోల్చితే పసిడి ధర అతి స్వల్పంగా తగ్గింది. ఆదివారం నాడు 22 క్యారెట్ల బంగారం ధర 55,800 రూపాయలు ఉండగా, సోమవారం 55,790 రూపాయలుగా ఉంది. 10 గ్రాములపై కేవలం 10 రూపాయలు తగ్గడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం ధరలో కూడా ఇదే మార్పు. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ఏప్రిల్ 9న రూ.60,870 ఉండగా, ఏప్రిల్ 10న 60,860 రూపాయలకు తగ్గింది. అతి స్వల్పంగా పది గ్రాములపై పది రూపాయలు మాత్రమే తగ్గడం గమనార్హం.
ఈ పది రోజుల్లో చూసుకుంటే.. ఏప్రిల్ 4, ఏప్రిల్ 5న.. ఈ రెండు రోజులు మాత్రం బంగారం ధర ఊహించని రీతిలో పెరిగింది. ఏప్రిల్ 4న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 600 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 660 రూపాయలు పెరిగింది. ఏప్రిల్ 5న అయితే పసిడి ధర రివ్వున తారాజువ్వ మాదిరిగా దూసుకెళ్లింది. ఏప్రిల్ 5న 22 క్యారెట్ల బంగారం ధరపై 950 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధరపై 1030 రూపాయలు పెరగడం గమనార్హం. ఆ తర్వాత అడపాదడపా ధర తగ్గిందే తప్ప చెప్పుకోతగిన స్థాయిలో తగ్గిందేమీ లేదు.
ఇక.. వెండి ధరల విషయానికొస్తే.. ఆదివారం ఏ ధర అయితే ఉందో.. సోమవారం కూడా అదే ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.76,600 రూపాయలుగా ఉంది. అయితే.. హైదరాబాద్‌లో మాత్రం వెండి కాస్తంత ప్రియంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 80,200 రూపాయలుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో సోమవారం నాడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం.
బంగారం ధరలు ప్రధాన నగరాల వారీగా..
* హైదరాబాద్: రూ. 55,790 (22K), రూ.60,860 (24K)
* చెన్నై: రూ.56,390 (22K), రూ.61,520 (24K)
* ఢిల్లీ: రూ.55,940 (22K), రూ.61,010 (24K)
* బెంగళూరు: రూ.55,840 (22K), రూ.60,910 (24K)
* కోల్‌కత్తా: రూ.55,790 (22K), రూ.60,860 (24K)
* అహ్మదాబాద్: రూ.55,840 (22K), రూ.60,910 (24K)
* భువనేశ్వర్: రూ.55,790 (22K), రూ.60,860 (24K)
Updated Date - 2023-04-10T10:06:53+05:30 IST