ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Finance News: సడన్‌గా డబ్బు అవసరం పడినప్పుడు ఇదే బెస్ట్ ఆప్షన్.. సులువుగా అవసరాలు తీరుతాయి..

ABN, First Publish Date - 2023-02-12T20:07:25+05:30

అకస్మాత్తుగా డబ్బు అవసరం పడినప్పుడు గోల్డ్ లోన్ కోసం ట్రై చేయడం మంచిదని నిపుణులు చెబుతారు. ఎందుకంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో ఎల్లవెళ్లలా మనం ఆశించినట్టు జరగదు. ఏదో కారణంతో అకస్మాత్తుగా డబ్బు అవసరం పడొచ్చు. అలాంటి టైంలో మనలో చాలామంది అప్పు చేసేందుకు ప్రయత్నిస్తాం. తెలిసిన వాళ్ల దగ్గర వడ్డీపై అప్పు తెచ్చుకోవడం, పర్సనల్ లోన్‌ల కోసం ప్రయత్నించడం వంటివి చేస్తుంటాం. అయితే.. అత్యవసర సమయాల్లో ఇంట్లో బంగారం ఉంటే దాన్ని కుదువ పెట్టి అప్పు తెచ్చుకోవడం(Gold loans) అనుసరణీయమేనని ఆర్థిక నిపుణులు చెబుతారు.

బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్లు తెచ్చుకోవాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాలి. కానీ గోల్డ్ లోన్ పొందడం చాలా సులువని అనుభవజ్ఞుల అభిప్రాయం. లోన్ తీసుకునే నాటికి బంగారం క్వాలటీని బట్టి దాని విలువలో 75 శాతం వరకూ లోన్ కింద పొందవచ్చు. అంతేకాకుండా.. దరఖాస్తుదారులు లోన్ తీసుకునేందుకు ఎటువంటి ఆదాయధ్రువీకరణ పత్రాలు చూపించనక్కర్లేదు. బంగారం లోన్లతో బ్యాంకులకు రిస్క్ తక్కువ. కాబట్టి..గోల్డ్ లోన్స్ విషయంలో బ్యాంకులు 7 నుంచి 10 వరకూ వడ్డీ మాత్రమే వసూలు చేస్తాయి. వీలైనంత త్వరగా లోన్ మొత్తాన్ని విడుదల చేస్తాయి. లోన్ దరఖాస్తుదారు వయసు, క్రెడిట్ స్కోర్, ఉద్యోగవ్యాపారాలు, అతడి ఆర్థికస్థితి వంటి వాటితో నిమిత్తం లేకుండా సులభంగా లోన్ జారీ అవుతుంది. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే గోల్డ్ లోన్ క్యాలుక్లేటర్ల ద్వారా మనకు వచ్చే లోన్ మొత్తం ఎంతో వెంటనే ఓ అంచనాకు రావచ్చు. అయితే.. లోన్ ఇచ్చే సంస్థలు వడ్డీతో పాటూ ఇతర చార్జీలను విధిస్తాయి. లోన్ తీసుకునే సమయంలో ఆయా సంస్థలను సంప్రదిస్తే అన్ని వివరాలు తెలుస్తాయి.

ఇతర లోన్లతో పోలిస్తే.. గోల్డ్ లోన్ల విషయంలో కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టు రుణాన్ని పొందొచ్చు. అంతేకాకుండా.. లోన్ చెల్లింపునకు సంబంధించిన నియమనిబంధనలూ సరళంగానే ఉంటాయనేది నిపుణుల మాట. కాబట్టి.. తమ వద్ద బంగారం ఉన్నవారు అత్యవసర సమయాల్లో గోల్డ్ లోన్స్ తీసుకోవడం మంచి నిర్ణయమని ఆర్థికనిపుణుల చెబుతారు.

Updated Date - 2023-02-12T20:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising