ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold Rate Today: వరుసగా రెండు రోజు తగ్గిన బంగారం ధరలు.. భారీగా అనలేం గానీ..

ABN, First Publish Date - 2023-02-15T08:09:03+05:30

ఫిబ్రవరి 15న బంగారం ధరలు (Feb 15 Gold Rates) దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో (Gold Prices In Hyderabad) 22 క్యారెట్ల బంగారం (22K Gold Price) 10 గ్రాముల ధర..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిబ్రవరి 15న బంగారం ధరలు (Feb 15 Gold Rates) దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో (Gold Prices In Hyderabad) 22 క్యారెట్ల బంగారం (22K Gold Price) 10 గ్రాముల ధర మంగళవారం 52,500 రూపాయలు ఉండగా.. బుధవారానికి ఈ ధర రూ.52,400కి తగ్గింది. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం బంగారం ధర 10 గ్రాములపై 100 రూపాయలు తగ్గింది. అయితే.. 24 క్యారెట్ల బంగారం ధరలో మాత్రం మార్పు కనిపించింది. అతి స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మంగళవారం నాడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 57,230 రూపాయలు ఉండగా బుధవారం రూ.57,240కి పెరిగింది. ఓవరాల్‌గా ఫిబ్రవరిలో ఇప్పటివరకూ బంగారం ధరలను పరిశీలిస్తే.. పెద్దగా మార్పు లేదనే చెప్పాలి.

ఫిబ్రవరి 5న 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 ఉండగా, బుధవారం కూడా అదే ధర ఉండటం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం ధరల మాత్రం స్వల్ప పెరుగుదల కనిపించింది. ఫిబ్రవరి 5న 24 క్యారెట్ల బంగారం ధర 57,160 రూపాయలు ఉండగా, ఫిబ్రవరి 15న ఈ ధర రూ.57,230 దగ్గర నిలిచింది. ఇక.. దేశవ్యాప్తంగా ఉన్న నేటి బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం దేశంలో ప్రధాన నగరాల్లో చెన్నైలో అత్యధికంగా రూ.53,300 ఉండగా, చాలా నగరాల్లో రూ.52,400గా ఉంది.

హైదరాబాద్- రూ.52,400 (22K), రూ.57,240 (24K)

విజయవాడ- రూ.52,400 (22K), రూ.57,160 (24K)

విశాఖపట్నం- రూ.52,400 (22K), రూ.57,160 (24K)

చెన్నై- రూ.53,300 (22K), రూ.58,140 (24K)

ఢిల్లీ- రూ.52,550 (22K), రూ.57,310 (24K)

ముంబై- రూ.52,400 (22K), రూ.57,160 (24K)

బెంగళూరు- రూ. 52,450 (22K), రూ.57,210 (24K)

ఇక.. ఇవాల్టి వెండి ధరలను గమనిస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర మంగళవారం నాడు 72,000 ఉండగా, ఈ ధర బుధవారానికి 72,500కి ఎగబాకింది. కిలో వెండి ధరపై బుధవారం 500 రూపాయలు పెరిగింది. ఫిబ్రవరి 5తో పోల్చితే వెండి ధర తగ్గిందన చెప్పాలి. ఫిబ్రవరి 5న కిలో వెండి ధర రూ.74,200 ఉండగా, ఫిబ్రవరి 15న 72,500గా ఉంది. అంటే.. ఈ పది రోజుల్లో కిలో వెండి ధరపై రూ.1,700 తగ్గుదల కనిపించింది.

Updated Date - 2023-02-15T08:09:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising