Feb 14 Gold Rate Today: బంగారం ధరలు తగ్గాయండోయ్.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాములు ఎంతంటే..
ABN, First Publish Date - 2023-02-14T07:11:29+05:30
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ ప్రియమైన వారికి బంగారం కొనివ్వాలని ఆశపడుతున్న వారికి ఇది కొంతలో కొంత ఊరట కలిగించే విషయమనే చెప్పొచ్చు. సోమవారంతో..
ఫిబ్రవరి 14న (Feb 14) ప్రేమికుల దినోత్సవం (Valentine Day) సందర్భంగా తమ ప్రియమైన వారికి బంగారం (Gold Prices Today) కొనివ్వాలని ఆశపడుతున్న వారికి ఇది కొంతలో కొంత ఊరట కలిగించే విషయమనే చెప్పొచ్చు. సోమవారంతో (ఫిబ్రవరి 13) పోల్చుకుంటే బులియన్ మార్కెట్‌లో బంగారం ధర మంగళవారం నాడు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో (Gold Rate in Hyderabad) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సోమవారం రూ.52,600 పలకగా, మంగళవారం నాడు 100 రూపాయలు తగ్గి రూ.52,500గా ఉంది. 100 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై ధర వెయ్యి రూపాయలు తగ్గింది. ఇక.. 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం రూ.57,380 ఉండగా, మంగళవారానికి ఈ ధర రూ.57,230కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 150 రూపాయలు తగ్గిందనమాట. 100 గ్రాములపై 1500 రూపాయలు తగ్గింది.
ఫిబ్రవరి 4 నుంచి.. అంటే గత పది రోజులుగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలను నిశితంగా పరిశీలిస్తే ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఈ పది రోజుల్లో ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 12న తప్ప మిగిలిన రోజుల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించడం గమనార్హం. ఫిబ్రవరి 6న అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 250 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 280 రూపాయలు పెరగడాన్ని గమనించవచ్చు. ఫిబ్రవరి 4న, ఫిబ్రవరి 10న బంగారం ధర చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గింది. ఫిబ్రవరి 4న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 700 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 770 రూపాయలు తగ్గింది. ఫిబ్రవరి 10న కూడా 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు తగ్గి 52,400 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 550 రూపాయలు తగ్గి 57,160 పలికింది. మొత్తంగా చూసుకుంటే.. బంగారం ధర నేడు తగ్గినప్పటికీ అంత గణనీయంగా తగ్గిందని మాత్రం చెప్పలేం. వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.72,000గా ఉంది. ఇక.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే..
ఢిల్లీ- రూ.52,650 (22K), రూ.57,380 (24K)
చెన్నై- రూ.53,350 (22K), రూ.58,200 (24K)
ముంబై- రూ.52,500 (22K), రూ.57,230 (24K)
హైదరాబాద్- రూ.52,500 (22K), రూ.57,230 (24K)
విజయవాడ- రూ.52,500 (22K), రూ.57,230 (24K)
విశాఖపట్నం- రూ.52,500 (22K), రూ.57,230 (24K)
బెంగళూరు- రూ. 52,550 (22K), రూ.57,280 (24K)
అయితే.. బంగారం, వెండి ధరలు ప్రస్తుతానికి స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ మున్ముందు మరింత పెరగవచ్చని బులియన్ మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో తులం బంగారం రూ.60,000 దాటే అవకాశాలున్నాయని వారు అంచనా వేస్తున్నారు.
Updated Date - 2023-02-14T07:14:50+05:30 IST