ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గోల్డెన్‌ రన్‌!

ABN, First Publish Date - 2023-12-05T02:28:48+05:30

పెళ్లిళ్ల సీజన్‌లో విలువైన లోహాలు కొండెక్కుతున్నాయి. పసిడి ధర సరికొత్త రికార్డు గరిష్ఠానికి ఎగబాకింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర సోమవారం రూ.64,300కు...

పసిడి సరికొత్త ఆల్‌టైమ్‌ రికార్డు

  • జూ ఢిల్లీలో రూ.64,300కు తులం ధర

  • జూ రూ.80,000 దాటిన కిలో వెండి

ఇంటర్నేషనల్‌ మార్కెట్లో 2,100 డాలర్లకు ఔన్స్‌ బంగారం

పెళ్లిళ్ల సీజన్‌లో విలువైన లోహాలు కొండెక్కుతున్నాయి. పసిడి ధర సరికొత్త రికార్డు గరిష్ఠానికి ఎగబాకింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర సోమవారం రూ.64,300కు చేరుకుంది. గత శనివారం నమోదైన రూ.63,850తో పోలిస్తే రూ.450 పెరిగింది. కిలో వెండి రేటు మాత్రం ఏ మార్పు లేకుండా రూ.80,200 ధర పలికింది. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణమని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు పేర్కొంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు ఒకదశలో కొత్త ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయి 2,110 డాలర్లకు పెరిగింది. అయితే, మళ్లీ జారి 2,063 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. సిల్వర్‌ 25 డాలర్లకు చేరువలో ఉంది. ఫెడ్‌ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు బులియన్‌ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఏడాదిలోనూ ఔన్స్‌ గోల్డ్‌ 2,000 డాలర్లకు ఎగువనే కదలాడవచ్చని వారు భావిస్తున్నారు.

Updated Date - 2023-12-05T02:28:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising