ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HDFC Bank: గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

ABN, First Publish Date - 2023-01-28T18:51:48+05:30

దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank) శుభవార్త చెప్పింది. రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank) శుభవార్త చెప్పింది. రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉండే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల(Fixed Deposits)పై వడ్డీ రేట్లను పెంచింది. సాధారణ డిపాజిటర్లు వారం రోజుల నుంచి పదేళ్ల వరకు మెచ్యూరిటీ కాలపరిమితిపై 4.50 శాతం, 7.00 శాతం మధ్య వడ్డీ రేట్లు పొందుతారు. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 5.00 శాతం, 7.75 శాతం మధ్య వడ్డీ రేట్లు చెల్లిస్తారు.

బ్యాంకు వడ్డీ రేట్లను సవరించడంతో 15 నెలల నుంచి రెండేళ్ల కాలానికి మెచ్యూరయ్యే డిపాజిట్లపై సాధారణ ప్రజలకు గరిష్ఠంగా 7.15 శాతం వడ్డీ రేటు, 5 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల కోసం సీనియర్ సిటిజన్ల(Senior Citizens)కు గరిష్ఠంగా 7.75 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కొత్త బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు జనవరి 27 నుంచి అందుబాటులోకి వచ్చినట్టు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.

వచ్చే ఏడు రోజుల నుంచి 29 రోజుల్లో మెచ్యూరయ్యే డిపాజిట్లకు 4.50 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్టు బ్యాంకు పేర్కొంది. అలాగే, వచ్చే 30 రోజుల నుంచి 45 రోజుల మధ్య మెచ్యూరయ్యే డిపాజిట్లకు 5.25 శాతం వడ్డీ రేటు లభిస్తుందని తెలిపింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రకారం.. 46 నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లకు 5.50 శాతం వడ్డీ రేటు, 61 నుంచి 89 రోజుల మధ్య డిపాజిట్లకు 5.75 శాతం వడ్డీ లభిస్తుంది. 90 రోజుల నుంచి 6 నెలల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6.25 శాతం, 6 నెలల ఒక రోజు రోజు నుంచి 9 నెలల మధ్య డిపాజిట్లకు 6.50 శాతం వడ్డీ అందిస్తుంది.

అలాగే, 9 నెలల ఒక రోజు నుంచి ఏడాది డిపాజిట్లపై 6.65 శాతం, ఏడాది నుంచి 15 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 7 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) తెలిపింది.

Updated Date - 2023-01-28T18:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising