రూపాయి చెల్లింపులపై ఆయిల్ సరఫరాదారుల అనాసక్తి
ABN, Publish Date - Dec 25 , 2023 | 01:36 AM
క్రూడాయిల్ దిగుమతి బిల్లులు రూపాయి విలువలోనే చెల్లించాలన్న భారత్ ప్రయత్నాలను స్వీకరించిన వారెవరూ లేరని, పైగా భారీ లావాదేవీల వ్యయాలు, నిధుల తరలింపు...
న్యూఢిల్లీ: క్రూడాయిల్ దిగుమతి బిల్లులు రూపాయి విలువలోనే చెల్లించాలన్న భారత్ ప్రయత్నాలను స్వీకరించిన వారెవరూ లేరని, పైగా భారీ లావాదేవీల వ్యయాలు, నిధుల తరలింపు పట్ల ఆయిల్ సరఫరాదారులు ఆందోళన ప్రకటించారని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి చమురు మంత్రిత్వ శాఖ నివేదించింది. అంతర్జాతీయ వాణిజ్య విధానాల ప్రకారం అన్ని కాంట్రాక్టులకు డీఫాల్ట్ పేమెంట్ కరెన్సీగా అమెరికన్ డాలర్ ఉంటుంది. భారతీయ కరెన్సీని అంతర్జాతీయీకరించే లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఎగుమతి, దిగుమతులకు రూపాయి లావాదేవీలను 2022 జూలై 11వ తేదీన ఆమోదించింది. నాన్ ఆయిల్ ట్రేడ్‌లో ఇది కొంత విజయం సాధించినా ఆయిల్ వ్యాపారులు మాత్రం రూపాయి చెల్లింపులకు విముఖత ప్రదర్శిస్తూనే ఉన్నారు.
Updated Date - Dec 25 , 2023 | 01:36 AM