ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Infosys: ఇన్ఫోసిస్‌లో చేరిన ఫ్రెషర్లకు దిమ్మతిరిగే షాక్..!

ABN, First Publish Date - 2023-02-05T17:23:47+05:30

ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న పలువురు ఫ్రెషర్లకు ఇటీవల భారీ షాక్ తగిలింది. ఫ్రెషర్‌ అసెస్‌మెంట్ పేరిట ఇన్ఫోసిస్‌లో జరిగే అంతర్గత పరీక్షలో విఫలమైన వారు ఉద్యోగాల్ని కోల్పోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ఫోసిస్‌లో(Infosys) పనిచేస్తున్న పలువురు ఫ్రెషర్లకు(Freshers) ఇటీవల భారీ షాక్ తగిలింది. ఫ్రెషర్‌ అసెస్‌మెంట్(Fresher Assesment) పేరిట ఇన్ఫోసిస్‌లో జరిగే అంతర్గత పరీక్షలో విఫలమైన వారు ఉద్యోగాల్ని కోల్పోయారు(Fired). పరీక్షలో విఫలమైనందున ఉద్యోగం నుంచి తొలగించామంటూ వారికి సంస్థ సమాచారం ఇచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. గత కొద్ది నెలల్లోనే సంస్థ 600 మందిని ఉద్యోగాల్లోంచి తీసేసింది. గత నెలలో ఎఫ్‌ఏ టెస్టులో ఉత్తీర్ణులు కాలేకపోయిన 280 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఈ నెల మొదటి వారంలో జరిగిన టెస్టుకు 150 మంది హాజరవగా.. ఉత్తీర్ణులు కాలేకపోయిన 90 మంది ఉద్యోగాలను కోల్పోయారు. 2022 జులై నాటి బ్యాచ్‌లో 85 మంది ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ ఈ కారణంతోనే తొలగించింది. అయితే..తాము ఉద్యోగాలు కోల్పోవడానికి టెస్టులో ఫెయిలవడం కారణం కాదని ఫ్రెషర్లు చెబుతున్నారు. సంస్థ ప్రతినిధులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. మరోవైపు.. ఇన్ఫోసిస్‌ నుంచి ఆఫర్‌ లెటర్లు పొందిన అనేక మంది ఎనిమిది నెలలుగా సంస్థలో చేరేందుకు పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఆదాయం రాక అవస్థలు పడుతున్నారు.

విప్రోలోనూ(Wipro) ఇంచుమించు ఇదే సీన్..

మరో ఐటీ సంస్థ విప్రో కూడా కొద్ది వారాల క్రితమే 452 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. పనితీరు బాలేదన్న కారణంతో వారిని తీసేసింది. విప్రోలో ఉద్యోగం పోగొట్టుకున్న ఫ్రెషర్ల సంఖ్య 800 వరకూ ఉండొచ్చట.

జనవరిలో తొలగింపుల పర్వం

గత నెలలో టెక్ కంపెనీలు ఏకంగా లక్ష మంది ఉద్యోగులను తీసేశాయి. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలన్నీ నిర్మొహమాటంగా ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. అమెజాన్ 18 వేల మందిని తొలగించగా.. గూగుల్ 12 వేలు, మైక్రోసాఫ్ట్ 10 వేల మంది ఉద్యోగులను తీసేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-05T17:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising