iQOO Z7 5G: 5జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావాలనుకుంటున్నారా?.. అద్భుతమైన ఫీచర్లున్న ఈ నయా స్మార్ట్‌ఫోన్‌ను ట్రై చేయండి!
ABN, First Publish Date - 2023-03-21T20:46:27+05:30
ఐకూ(iQOO) నుంచి నయా స్మార్ట్‌ఫోన్ ఒకటి భారత మార్కెట్లోకి వచ్చేసింది. అత్యద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు!
న్యూఢిల్లీ: ఐకూ(iQOO) నుంచి నయా స్మార్ట్‌ఫోన్ ఒకటి భారత మార్కెట్లోకి వచ్చేసింది. అత్యద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు! ‘ఐకూ జడ్7 5జీ’(iQOO Z7 5G) పేరుతో వచ్చిన దీనిని మిడ్ రేండ్ సెగ్మెంట్‌లో విడుదల చేసింది. 5జీ అప్‌గ్రేడ్ అవాలనుకుంటున్న వారికి ఇది మంచి ఆప్షన్ 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 64 ఎంపీ కెమెరా సహా మరెన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
భారత్‌లో ఐకూ జడ్7(iQOO Z7 5G) 5జీ పరిచయ ధర రూ. 17,499 మాత్రమే. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. బేస్ మోడల్ 6జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మెమరీతో వస్తోంది. దీని ధర రూ. 18,999. టాప్ ఎండ్ మోడల్ అయిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కలిగిన స్మార్ట్‌ఫోన్ ధర రూ. 19,999 మాత్రమే.
ఐకూ జడ్7 5జీ లాంచింగ్ ధర
లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ(HDFC), ఎస్‌బీఐ(SBI) కార్డుదారులకు రూ. 1500 రాయితీ లభిస్తుంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. కాబట్టి మీరు కనుక ఐకూ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటే ఇదే మంచి తరుణం. రాయితీ తర్వాత ఈ ఫోన్ 6జీబీ మోడల్ రూ. 17, 499కి, 8జీబీ ర్యామ్ వేరియంట్ రూ. 18,499కి లభిస్తుంది. అమెజాన్ ఇండియా, ఐకూ స్టోర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
ఐకూ జడ్ 7 5జీ స్పెసిఫికేషన్లు
6.28 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 6జీబీ/128 జీబీ, 8జీబీ/128 జీబీ వేరియంట్లు, ఫన్‌టచ్ ఓఎస్ 13 స్కిన్ ఆధారిత ఆండ్రాయిడ్ 13 ఓఎస్. వెనకవైపు 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో రెండు కెమెరాలు, ముందువైపు 16 ఎంపీ కెమెరా, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్ ఉపయోగించిన ఈ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో లభిస్తోంది.
Updated Date - 2023-03-21T20:50:09+05:30 IST