జియో ఫైనాన్షియల్ సర్క్యూట్ లిమిట్ 20 శాతానికి పెంపు
ABN, First Publish Date - 2023-09-04T01:58:17+05:30
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జేఎ్‌ఫఎ్‌సఎల్) సర్క్యూట్ లిమిట్‌ను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్లు..
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జేఎ్‌ఫఎ్‌సఎల్) సర్క్యూట్ లిమిట్‌ను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్లు.. ఈనెల 4(సోమవారం) నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎ్‌సఈ తెలిపింది. అంటే, ఒకరోజులో ఈ కంపెనీ షేరు ధర 20 శాతానికి మించి పెరగడం లేదా క్షీణించడం జరగదన్నమాట. అంతేకాదు, వచ్చే వారంలో ఈ స్టాక్ ‘ట్రేడ్ టు ట్రేడ్’ సెగ్మెంట్ నుంచి కూడా బయటికి రావచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) నుంచి విభజించిన ఆర్థిక సేవల విభాగమైన జేఎ్‌ఫఎ్‌సఎల్ షేర్లు గతనెల 21న స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదయ్యాయి
Updated Date - 2023-09-04T01:58:17+05:30 IST