జోస్ అలుక్కాస్ ప్రచారకర్తలుగా మాధవన్, కీర్తి సురేశ్
ABN, First Publish Date - 2023-03-31T01:56:39+05:30
ప్రముఖ జువెలరీ గ్రూప్ జోస్ అలుక్కాస్.. తన ఉత్పత్తుల ప్రచారానికి నటుడు ఆర్ మాధవన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది...
హైదరాబాద్: ప్రముఖ జువెలరీ గ్రూప్ జోస్ అలుక్కాస్.. తన ఉత్పత్తుల ప్రచారానికి నటుడు ఆర్ మాధవన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. కాగా హీరోయిన్ కీర్తి సురేశ్.. జోస్ అలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతారు. ఈ మేరకు ఇరువురితో జోస్ అలుక్కాస్ ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా జోస్ అలుక్కాస్ బ్రాండ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో మాధవన్‌ను ప్రచారకర్తగా నియమించుకున్నట్లు గ్రూప్ చైర్మన్ జోస్ అలుక్కాస్ వెల్లడించారు. కాగా బంగారం, వజ్రాభరణాలకు కీర్తి సురేశ్ ప్రచారం కొనసాగిస్తారని తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా ఉత్పత్తులను తీసుకువస్తున్న జోస్ అలుక్కా్‌సతో కలిసి పనిచేయటం ఎంతో సంతోషంగా ఉందని మాధవన్, కీర్తి సురేశ్ అన్నారు.
Updated Date - 2023-03-31T01:56:39+05:30 IST