Nandan Nilekami: ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు.. తనకు విద్య నేర్పిన సంస్థకి రూ.315 కోట్లు విరాళం ఇచ్చేశాడు.. ఇంతకీ ఈయన ఎవరో తెలుసా...
ABN, First Publish Date - 2023-06-20T19:20:04+05:30
ఇన్ఫోసిస్ (Infosys) సహ-వ్యవస్థాపకుడు నందన్ నిలేకని (Nandan Nilekani) తాను చదువుకున్న ఐఐటీ బాంబేకి (IIT Bombay) ఏకంగా రూ.315 కోట్ల భారీ విరాళం ఇచ్చాడు. ఐఐటీ బాంబేతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ భారీ మొత్తాన్ని ప్రకటించారు. కాగా నందన్ నిలేకని బ్యాచ్‌లర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివేందుకు 1973లో ఐఐటీ బాంబేలో చేరారు.
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ (Infosys) సహ-వ్యవస్థాపకుడు, ఆధార్ (Aadhaar) సృష్టికర్త నందన్ నిలేకని (Nandan Nilekani) తాను చదువుకున్న ఐఐటీ బాంబేకి (IIT Bombay) ఏకంగా రూ.315 కోట్ల భారీ విరాళం ఇచ్చాడు. ఐఐటీ బాంబేతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ భారీ మొత్తాన్ని ప్రకటించారు. కాగా నందన్ నిలేకని బ్యాచ్‌లర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివేందుకు 1973లో ఐఐటీ బాంబేలో చేరారు.
క్యాంపస్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో మరిన్ని పరిశోధనలు, టెక్ స్టార్టప్‌కు ఊతమివ్వడమే లక్ష్యంగా ఈ భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్టు ప్రకటనలో నందన్ నిలేకని వివరించారు. ఇండియాలో పూర్వవిద్యార్థులు ఇచ్చిన విరాళాల్లో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.
‘‘ ఐఐటీ బాంబే నా జీవితంలో మూలస్థంభం లాంటిది. తొలినాళ్లలో నాకో రూపమిచ్చింది. నా ప్రయాణానికి పునాది వేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ విద్యాసంస్థతో నా అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంతో తీసుకున్నా నేను తిరిగిచ్చేందుకు సంతోషంగా ఉన్నాను. ఐఐటీ బాంబే భవిష్యత్ కోసం తోడ్పాటునందిస్తాను’’ అని నిలేకని పేర్కొన్నారు. ఈ సాయం ఆర్థిక తోడ్పాటుకంటే అధికమని, తనకు ఎంతో ఇచ్చిన స్థానానికి చిన్న ఉపకారమని వ్యాఖ్యానించారు. ‘‘ రేపటి మన ప్రపంచానికి రూపమివ్వబోతున్న విద్యార్థులకు సాయపడాలనేది నా సంకల్పం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-06-20T19:20:04+05:30 IST