NSDC: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌తో ఎన్‌ఎస్‌డీసీ భాగస్వామ్యం
ABN, First Publish Date - 2023-02-17T21:40:56+05:30
స్కిల్ ఇండియా మిషన్ కింద దేశంలో అగ్రగామి జీవిత బీమా సంస్థల్లో ఒక్కటైన హెచ్‌డీఎఫ్‌సీ
న్యూఢిల్లీ: స్కిల్ ఇండియా మిషన్ కింద దేశంలో అగ్రగామి జీవిత బీమా సంస్థల్లో ఒక్కటైన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌తో నేషనల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్వయం ఉపాధికి మద్దతు అందించడంతోపాటు వ్యవస్థాపక అవకాశాలకు మద్దతు అందించే ఉద్దేశంతో ఈ ఒప్పందం జరిగింది. ఈ భాగస్వామ్యంతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) నిర్వహించే ఐసీ 38 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు శిక్షణ సైతం అందించనుంది. అంతేకాకుండా సాఫ్ట్ స్కిల్స్‌ను అందించడం ద్వారా ఈ భాగస్వామ్యం, స్థిరమైన జీవనోపాధి కోసం స్వీయ ఉపాధి అవకాశాలను అన్వేషించేలా యువతకు తగిన సదుపాయాలను సైతం అందిస్తుంది.
ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌డీసీ ఇంటర్నేషనల్ ఎండీ, సీఈఓ వేద్ మణి తివారి మాట్లాడుతూ.. స్థిరమైన, సాధ్యమయ్యే నైపుణ్య వ్యవస్థను సృష్టించేందుకు ఎన్‌ఎస్‌డీసీ ప్రయత్నిస్తోందన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌తో ఈ భాగస్వామ్యం ప్రస్తుత నైపుణ్యాలను బలోపేతం చేయడం, మార్కెట్ అవసరాలకు తగినట్లుగా బీమా రంగంలో నైపుణ్యాభివృద్ధి చేయడం దిశగా అతి ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు. ఈ భాగస్వామ్యం రెండు సంస్థలకు భారీ వృద్ధి సామర్థ్యాన్ని అందించడంతో పాటు ఉద్యోగార్ధుల నుంచి ఉద్యోగ ప్రదాతలుగా మారడానికి అర్హత కలిగిన అభ్యర్థులకు అత్యున్నత అవకాశాలనూ అందిస్తుందని అన్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ బదామీ మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌డీసీతో భాగస్వామ్యంపై సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. దీని ద్వారా స్కిల్ ఇండియా మిషన్‌కు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం జీవనోపాధి సృష్టిని సులభతరం చేయడానికి, ఆర్థిక, సామాజిక చేరిక కోసం వ్యవస్థాపక అవకాశాలకు ప్రోత్సహించడానికి ఉద్దేశించినట్టు వివరించారు.
Updated Date - 2023-02-17T21:40:57+05:30 IST