రోడ్డు పైకి ఒలెకా్ట్ర ఎలక్ట్రిక్ టిప్పర్ Olectra electric tipper on the road
ABN, First Publish Date - 2023-03-02T01:40:59+05:30
రోడ్డు పైకి ఒలెకా్ట్ర ఎలక్ట్రిక్ టిప్పర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ రోడ్డెక్కనుంది. 20 టిప్పర్లను విక్రయించడానికి చర్చలు చివరి దశలో ఉన్నాయని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ తెలిపారు. ఇండియన్ ఆటోమొబైల్ రెగ్యులేటరీ ఏజెన్సీల నుంచి ఎలక్ట్రిక్ టిప్పర్‌కు అనుమతులు లభించాయి. సెంట్రల్ మోటార్ వాహనాల నిబంధనలకు అనుగుణంగా ఈ-టిప్పర్ ఉంది. దేశంలోనే తొలి సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ టిప్పర్‌ను కంపెనీ డిజైన్ చేసి తయారు చేసిందని చెప్పారు. ఇటీవల ఢిల్లీ, బెంగళూరుల్లో జరిగిన ఎగ్జిబిషన్లలో ఈ-టిప్పర్‌ను ఒలెకా్ట్ర ప్రదర్శించింది. ఎత్తైన పర్వత ప్రదేశాలను, మైనింగ్ జరిగే లోతైన గనుల్లోకి ఈ-టిప్పర్ ప్రయాణించగలదన్నారు. త్వరలో ఈ-టిప్పర్‌లో వేరియంట్లను కూడా ఒలెకా్ట్ర ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిక్ టిప్పర్ ధరను ఒలెకా్ట్ర ఇంకా ప్రకటించలేదు. దీని ధర దాదాపు రూ.1.5 కోట్లుండే వీలుంది.
Updated Date - 2023-03-02T01:40:59+05:30 IST