ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Paytm Layoffs: వెయ్యి మందికి పైగా ఉద్యోగుల తొలగింపు.. పేటీఎం షాకింగ్ నిర్ణయం

ABN, Publish Date - Dec 25 , 2023 | 05:07 PM

ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం ఉద్యోగులకు తాజాగా భారీ షాక్ తగిలింది. ఆపరేషన్స్, సేల్స్, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగులను పేటీఎం తాజాగా తొలగించింది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం (Paytm) ఉద్యోగులకు తాజాగా భారీ షాక్ తగిలింది. ఆపరేషన్స్, సేల్స్, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన వెయ్యి మందికి పైగా ఉద్యోగులను పేటీఎం యాజమాన్యం తొలగించింది (Layoffs). ఉత్పాదకత పెంపునకు ఏఐ టెక్నాలజీని రంగంలోకి దించిన నేపథ్యంలో సంస్థ ఈ మేరకు తొలగింపులు చేపట్టింది.

‘‘ఏఐ టెక్నాలజీతో ఉత్పాదకతలో పెంపుతో పాటూ రిపిటీటివ్ టాస్కులను, ఉద్యోగాలను తొలగిస్తూ మా కార్యకలాపాల్లో మార్పులు తెస్తున్నాం. ఖర్చులు తగ్గించుకుంటూ అభివృద్ధి దిశగా మార్పులకు ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలో ఆపరేషన్స్, మార్కెటింగ్ విభాగాల్లో స్వల్పంగా ఉద్యోగులను తొలగిస్తున్నాం. ఆశించిన దాని కంటే ఏఐతో ఎక్కువ ఫలితాలే వస్తుండటంతో 10 నుంచి 15 శాతం మేర ఉద్యోగులపై ఖర్చును తగ్గించుకుంటాం. ఏడాది అంతా పనితీరుకు సంబంధించి నిరంతరం సమీక్షలు నిర్వహిస్తుంటాం’’ అని పేటీఏం ప్రతినిధి ఒకరు తెలిపారు.


ప్రస్తుత వ్యాపారాలపై దృష్టి పెడుతూనే ఇన్సూరెన్స్, వెల్త్ విభాగాల్లో విస్తరణ చేపడతామని పేటీఎం ప్రతినిధి తెలిపారు. ‘‘లోన్ వితరణలో మా డిస్ట్రిబ్యూషన్ ఆధారిత బిజినెస్ మోడల్‌తో మంచి ఫలితాలు వస్తుండటంతో కొత్త వ్యాపారాల్లో కూడా ఈ మోడల్‌ను విస్తరిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా, పనితీరు సమీక్ష ఆధారంగా పేటీఎం 2021లో కూడా సుమారు 500 నుంచి 700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.

Updated Date - Dec 25 , 2023 | 05:13 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising