ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Reliance Jio: జియో నుంచి రెండు సరికొత్త డేటా ప్లాన్లు

ABN, First Publish Date - 2023-01-20T20:12:19+05:30

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) రెండు సరికొత్త డేటా ప్లాన్లు ప్రకటించింది. ఇందులో 2.5జీబీ డేటా లభిస్తుంది. జియో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) రెండు సరికొత్త డేటా ప్లాన్లు ప్రకటించింది. ఇందులో 2.5జీబీ డేటా లభిస్తుంది. జియో వెబ్‌సైట్ ద్వారా కానీ, మైజియో యాప్ ద్వారా కానీ వీటిని రీచార్చ్ చేసుకోవచ్చు. అలాగే, ఇతర రీచార్జ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ రెండు ప్లాన్లలోనూ అపరమిత కాల్స్ సౌకర్యంతోపాటు రోజుకు 2.5జీబీ డేటా మరెన్నో ప్రయోజనాలు లభిస్తాయి.

రూ. 349 ప్లాన్

ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. 30 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఈ కాలంలో మొత్తంగా 75 జీబీ డేటా లభిస్తుంది. అలాగే, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. జియో సినిమా, జియో టీవీ, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వెల్కమ్ ఆఫర్ కింద 5జీ సేవలను సైతం పొందొచ్చు.

రూ. 899 ప్లాన్

జియో తీసుకొచ్చిన మరో నూతన ప్లాన్ రూ.899. ఇందులో కూడా రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. కాలపరిమితి 90 రోజులు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో సినిమా, జియో టీవీ, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో మొత్తంగా 225 జీబీ డేటా లభిస్తుంది.

రూ.2,023 ప్లాన్

జియో ఇటీవల న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని రూ. 2,023 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో మొత్తం 630 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. డేటా పరిమితి ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్‌తో అపరిమిత డేటాను పొందొచ్చు. ప్లాన్ కాపరిమితి 252 రోజులు. ఇందులో కూడా పైన పేర్కొన్న అన్ని ప్లాన్లలోని ప్రయోజనాలు లభిస్తాయి.

జియో రూ.2,999 ప్లాన్

ఈ ప్లాన్‌నూ పైన పేర్కొన్న ప్లాన్‌లోని అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కాలపరిమితి మాత్రం 365 రోజులు. కాగా, జియో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 100కుపైగా నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు, ఏలూరు పట్టణాల్లోనూ జియో సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Updated Date - 2023-01-20T20:20:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising