Reliance JIO: ఏడో వార్షికోత్సవం సందర్భంగా జియో బంపరాఫర్.. ఈ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌పై ఏయే ఆఫర్లంటే?
ABN, First Publish Date - 2023-09-05T17:52:01+05:30
రిలయన్స్ జియో రావడం రావడంతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఏడాది కాలంపాటు ఉచితంగా సేవలు (కాల్స్, డేటా, మెసేజ్) అందించడంతో.. అప్పటివరకూ ఆ సేవలకు..
రిలయన్స్ జియో రావడం రావడంతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఏడాది కాలంపాటు ఉచితంగా సేవలు (కాల్స్, డేటా, మెసేజ్) అందించడంతో.. అప్పటివరకూ ఆ సేవలకు భారీ ధరలు కేటాయించిన ఇతర కంపెనీలన్నీ బెంబేలెత్తాయి. ఆ తర్వాతి నుంచి జియో తీసుకొచ్చిన ప్లాన్స్‌నే మిగతా సంస్థలు దాదాపు కాపీ కొడుతూ వస్తున్నాయి. అయితే.. జియో మాత్రం ఇతర సంస్థలు ఉలిక్కిపడేలా అప్పుడప్పుడు తన వినయోగదారులకు బంపరాఫర్లు ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా ఇది ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. అదిరిపోయే ఆపర్లను ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.299, రూ.749, రూ.2999 ప్లాన్స్‌పై జియో సంస్థ లేటెస్ట్‌గా అదనపు ప్రయోజనాల్ని అందిస్తోంది.
* తొలుత రూ.299 ప్లాన్ గురించి మాట్లాడుకుంటే.. 28 రోజుల వాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్‌పై అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లతో పాటు 2జీబీ డేటా అందిస్తోంది. తాజాగా ప్రకటించిన బంపరాఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌పై 7జీబీ డేటా అదనంగా అందుతుంది.
* రూ.749 ప్లాన్ విషయానికొస్తే.. 90 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్‌పై యూజర్లు ఇప్పటికే అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లతో పాటు ప్రతి రోజు 2జీబీ డేటా పొందుతున్నారు. లేటెస్ట్‌గా అదనపు ప్రయోజనాల్లో భాగంగా ఈ ప్లాన్‌పై యూజర్లు 14 జీబీ డేటా పొందుతారు.
* ఇక చివదినైన రూ.2,999 ప్లాన్ గురించి మాట్లాడితే.. ఇది వార్షిక ప్లాన్. దీనిపై యూజర్లు ఇప్పటికే రోజూ 2.5జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతున్నారు. ఇప్పుడు అదనపు ప్రయోజనాల్లో భాగంగా.. మూడు 7జీబీ కూపన్ల రూపంలో 21 అదనపు డేటా పొందుతారు.
అంతేకాదండోయ్.. రూ.149 లేదా అంతకంటే ఎక్కువగా రీఛార్జ్ ప్లాన్ కొనుగోలు చేస్తే, మెక్‌డొనాల్డ్స్ మీల్ ఉచితంగా పొందే ఆఫర్ కూడా జియో అందిస్తోంది. అలాగే.. రిలయన్స్ డిజిటల్‌పై 10 శాతం డిస్కౌంట్, ఫ్లైట్ టికెట్లపై రూ.1500 వరకు తగ్గింపు, హోటళ్లపై 15 శాతం తగ్గింపు (యాత్రతో పాటు రూ.4,000 వరకు) కూడా పొందవచ్చు. AJIOపై 20 శాతం, నెట్‌మెడ్‌లపై 20 శాతం (రూ.800) డిస్కౌంట్స్ సైతం పొందుతారు. ఈ జియో ప్రీ-పెయిడ్ ప్లాన్ ఆఫర్లను జియో సంస్థ ఇప్పటికే తన అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లో పొందుపరిచింది.
అయితే.. ఇక్కడే మరో విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జియో ప్రకటించిన ఈ ఏడో వార్షికోత్సవ ఆఫర్లు కేవలం సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే.. పైన పేర్కొన్న ప్రీ-పెయిడ్ ప్లాన్స్ అన్నీ కొత్తేవేమీ కావు, అవి పాతవే. ఏడో వార్షికోత్సవం సందర్భంగా.. వాటికి జియో లేటెస్ట్‌గా కొన్ని ప్రయోజనాలు మాత్రమే జోడించింది.
Updated Date - 2023-09-05T17:52:01+05:30 IST