Sids Farm: స్వల్పంగా పెరిగిన పాల ధరలు

ABN, First Publish Date - 2023-04-03T20:04:20+05:30

తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం

Sids Farm: స్వల్పంగా పెరిగిన పాల ధరలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డి2సి డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫామ్(Sids Farm) ఎ2 గేదె పాలు, ఎ2 డబుల్ డోన్డ్ గేదె పాల ధరలను స్వల్పంగా పెంచింది. అయితే, ఈ పెంపుదల అర లీటరు పౌచ్‌లకు మాత్రమే వర్తిస్తాయి. సవరించిన ధరల ప్రకారం ఎ2 గేదె పాల ధర అర లీటరు రూ. 55కు, ఎ2 డబుల్ టోన్డ్ గేదె పాల ధర రూ. 44కు పెరిగింది. అయితే, ఆవుపాలు, స్కిమ్ పాల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

నాణ్యత భరోసా కోసం అత్యంత కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుండడం, గత ఆరు నెలలుగా పాల సేకరణ ధరలు గణనీయంగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిద్స్ ఫామ్స్ తెలిపింది. దీనికి తోడు ఏప్రిల్-సెప్టెంబరు మధ్య పాల దిగుబడి 50 శాతానికి పైగా తగ్గే అవకాశాలు ఉండడం, ఉత్పత్తి వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల ధరలను పెంచాల్సి వచ్చిందని వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే పాల ధరను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని సిద్స్ ఫామ్ ఫౌండర్ డాక్టర్ కిశోర్ ఇందుకూరి అన్నారు.

Updated Date - 2023-04-03T20:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising