ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వచ్చేనెల 1 నుంచి టీసీఎస్‌ బైబ్యాక్‌

ABN, First Publish Date - 2023-11-29T01:51:46+05:30

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.17,000 కోట్ల సొంత షేర్ల తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) ప్రక్రియ వచ్చే నెల 1న ప్రారంభమై 7న ముగియనుంది...

ఒక్కో షేరు రూ.4,150కి తిరిగి కొనుగోలు

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.17,000 కోట్ల సొంత షేర్ల తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) ప్రక్రియ వచ్చే నెల 1న ప్రారంభమై 7న ముగియనుంది. ఇందులో భాగంగా కంపెనీ తన వాటాదారుల నుంచి కొనుగోలు చేయబోయే షేరు ఒక్కింటికి రూ.4,150 చెల్లించనుంది. కంపెనీలో 1.12 శాతం ఈక్విటీ వాటాకు సమానమైన 4,09,63,855 షేర్లను బహిరంగ మార్కెట్‌ నుంచి తిరిగి కొనుగోలు చేయనున్నట్లు సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా టీసీఎస్‌ ప్రకటించింది. గడిచిన ఆరేళ్లలో కంపెనీకిది ఐదో బైబ్యాక్‌.

2022, 2020, 2018, 2017లోనూ సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. తాజా ప్రకటనతో కలిపి ఈ ఆరేళ్లలో కంపెనీ మొత్తం రూ.66,000 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేసినట్లు అవుతుంది. బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు ధర మంగళవారం 0.37 శాతం పెరిగి రూ.3,470.45 వద్ద ముగిసింది.

Updated Date - 2023-11-29T01:51:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising