ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Union Budget 2023: గతేడాది ఏఏ వస్తువుల ధరలు పెరిగాయో.. వేటి ధరలు తగ్గాయో తెలుసా..?

ABN, First Publish Date - 2023-01-31T16:47:16+05:30

బడ్జెట్ కొందరికి సంతోషాన్ని ఇస్తే మరికొందరిని ఉసూరుమనిపిస్తుంది. 2023 కేంద్ర బడ్జెట్ రేపే వెలువడనుంది. ఈ నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బడ్జెట్ బండి వచ్చేస్తోంది.. శాలరీ చేతికి రాగానే ఇంట్లో దేనికి ఎంత ఖర్చు చేయాలి? దేంట్లో ఎంత పొదుపు చెయ్యాలి? దేనికి ఎంత కేటాయించాలని.. ప్రతి కుటుంబం ప్రణాళిక వేసుకున్నట్టు, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదీ బడ్జెట్ ప్రవేశపెట్టడం మాములే. ఈ బడ్జెట్‌లో భాగంగా మార్కెట్లో ఉన్న పలు వస్తువుల రేట్లు పెరగడం, మరికొన్ని తగ్గడం, పన్నులు, పెట్టుబడుల నిధులు ఇలా ఎన్నో నిర్ణయాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ కొందరికి సంతోషాన్ని ఇస్తే మరికొందరిని ఉసూరుమనిపిస్తుంది. 2023 కేంద్ర బడ్జెట్ రేపే వెలువడనుంది. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో వెలువడిన బడ్జెట్‌లో ఏ వస్తువుల ధరలు పెరిగాయి, వేటి ధర తగ్గాయి వంటి విషయాలను గుర్తు చేసుకుంటే...

తగ్గినవి ఏవంటే..

దుస్తులు, చెప్పులు, సెల్ ఫోన్లు, సెల్ ఛార్జర్ల ధరలు తగ్గాయి. ఇవి మాత్రమే కాకుండా కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలు.. సామాన్య ప్రజలు కొనగలిగే ధరల్లోకి అందుబాటులోకి వచ్చాయి. కెమెరా లెన్స్, తోలు వస్తువులు, వినికిడి పరికరాల ధరలు కూడా దిగొచ్చాయి.

ధర పెరిగినవి ఏవంటే..

హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, లౌడ్ స్పీకర్లు, స్మార్ట్ మీటర్లు, గొడుగులు, సోలార్ ప్లేట్స్, ఎక్స్-రే మిషన్లు తదితర వస్తువుల ధరలు పెరిగాయి. ఇక చమురు ధరలు కూడా ఏమాత్రం తగ్గకుండా పైపైకే వెళ్ళాయి.

ఇలా పలు వస్తువుల ధరలు పెరిగి, మరికొన్ని తగ్గుతూ 2022 బడ్జెట్ వెలువడినప్పుడు, అది సామాన్యుడి స్థాయికి చాలా భారంగా ఉందనే వార్తలు, విమర్శలు చాలా వచ్చాయి. మరి రేపు వెలువడబోయే కొత్త బడ్జెట్ బండిలో ఏ ధరల ఘాటు ఉంటుందో.. మరే తగ్గింపు స్వీటుందో వేచి చూడాలి.

Updated Date - 2023-02-01T08:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising