ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Union Budget 2023: ప్రతీ ఏటా ఫిబ్రవరి 1న.. ఉదయం 11 గంటలకే కేంద్ర బడ్జెట్‌ను ఎందుకు ప్రవేశ పెడతారంటే..

ABN, First Publish Date - 2023-02-01T12:53:53+05:30

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకే ఎందుకు ప్రవేశపెడతారో తెలుసా? ఒకప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ వేరుగా ఉండేది. ఆ తరువాత ఆ తేదీని మార్చారు. దాని వెనుక కారణం ఏమిటో తెలుసా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వతేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకే ఎందుకు ప్రవేశపెడతారో తెలుసా? ఒకప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ వేరుగా ఉండేది. ఆ తరువాత ఆ తేదీని మార్చారు. దాని వెనుక కారణం ఏమిటో తెలుసా? ఫిబ్రవరి ఒకటో తారీఖునే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం వెనుక ఎన్నో మార్పులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ప్రతీ ఏటా సరిగ్గా ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11గంటలకు బడ్జెట్ గుట్టు బయటపడుతూ ఉంటుంది. అయితే ఒకసారి గతంలోకి చూస్తే బడ్జెట్ ఎప్పుడూ ఫిబ్రవరి నెల చివరిలో ప్రవేశపెట్టేవారు. 2017 సంవత్సరానికి ముందు బడ్జెట్ ఎప్పుడూ ఫిబ్రవరి నెల చివరిలోనే పలకరించేది. అయితే 2017సంవత్సరంలో అప్పటి ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ మొదటిసారిగా బడ్జెట్ ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టారు. అప్పటినుండి అదే తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉందని చాలామందికి తెలియదు.

మొదట్లో బడ్జెట్ ను ఫిబ్రవరి నెల చివర్లో ప్రవేశపెట్టేవారు. బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన నెల రోజుల తర్వాత అంటే.. ఏప్రిల్ 1తేదీ నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. కేవలం ఒకే ఒక్క నెల రోజుల వ్యవధిలోనే బడ్జెట్ నిబంధనలను కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టడం పెద్ద సమస్యగా ఉండేది. ఈ కారణం వల్ల బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ను ప్రవేశ పెడితే కాల వ్యవధి ఎక్కువగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు. ఇలా బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీ అన్నది ఫిబ్రవరి ఒకటో తారీఖునకు మారింది.

ప్రతీ ఏటా ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11గంటలకే బడ్జెట్ ప్రసంగం ప్రారంభం అవడానికి కూడా ఓ కారణం ఉంది. ఇండియా బ్రిటీష్ గుప్పెట్లో ఉన్న సమయంలో బడ్జెట్ ను ప్రతి సంవత్సరం 11 గంటలకు ప్రవేశపెట్టేవారు. ఇది బ్రిటన్ లో జరిగేతంతు. భారతదేశ కాలమానం ప్రకారం ఇది సాయంత్రం 5 గంటల సమయం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బడ్జెట్ ను సాయంత్రం 5గంటలకే ప్రవేశపెట్టేవారు. అయితే 1999-2000 సంవత్సరంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ ను ఫిబ్రవరి 27, సాయంత్రం 5గంటలకు ప్రవేశపెట్టడానికి బదులు ఉదయం 11గంటలకు ప్రవేశపెట్టారు. అప్పటినుండి ఆ సమయాన్నే పాటిస్తున్నారు. ఇలా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే తేదీ.. సమయం మారుతూ వచ్చాయన్నమాట.

Updated Date - 2023-02-01T12:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising