ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tech Company Lay off: ఖరీదైన పార్టీ ఇచ్చి...13 శాతం సిబ్బందిని ఇంటికి పంపింది..!

ABN, First Publish Date - 2023-05-07T19:14:47+05:30

న్యూయార్క్: అమెరికాకు చెందిన ఓ సైబర్ సెక్యూరిటీ కంపెనీ నిర్వాకం ఇది. సిబ్బందికి, పరిశ్రమ ప్రముఖులకు ఖరీదైన పార్టీ ఇచ్చిన కొద్ది రోజులకే 13 శాతం సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 50 మంది సిబ్బంది ఉపాధి కోల్పోయారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ బిషఫ్ ఫాక్స్ ఈ లేఆఫ్‌లను ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: అమెరికాకు చెందిన ఓ సైబర్ సెక్యూరిటీ కంపెనీ (Cyber Security Company) నిర్వాకం ఇది. సిబ్బందికి, పరిశ్రమ ప్రముఖులకు ఖరీదైన పార్టీ ఇచ్చిన కొద్ది రోజులకే 13 శాతం సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నట్టు (Lay Off) ప్రకటించింది. దీంతో 50 మంది సిబ్బంది ఉపాధి కోల్పోయారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ బిషఫ్ ఫాక్స్ (Bishop Fox) ఈ మధ్యనే ఆర్ఎస్ఏ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. కాన్ఫరెన్స్ చివర్లో సిబ్బందితో సహా ఆహ్వానితులందరికీ అత్యంత ఖరీదైన పార్టీ ఇచ్చింది. బ్రాండెడ్ డ్రింకులు సరఫరా చేసింది. ఇది జరిగిన కొద్దిరోజులకే 13 శాతం సిబ్బందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఉద్యోగాలు ఒక్కసారిగా డీలా పడ్డారు. కంపెనీ నిర్ణయం తమను ఆశ్చర్యంలో ముంచెత్తిందని సోషల్ మీడియా పోస్టుల్లో వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పార్టీకి చెందిన ఫోటోలు గత ఏప్రిల్‌లో సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే, ఇది జరిగిన వారంరోజుల లోపే ఊహించని విధంగా తమపై వేటుపడటంతో మాజీలైన పలువురు ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా కొత్తగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆర్ఎస్ఏ పార్టీకి బిషప్ ఫాక్స్ సంస్థ ఎంత ఖర్చుపెట్టిందనే విషయాన్ని టెక్ క్రంచ్ రిపోర్ట్ వెల్లడించనప్పటికీ, కంపెనీలో ఇటీవల చేపట్టిన రీస్ట్రక్చరింగ్‌తో కంపెనీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉదని తెలిపింది.

కాగా, ప్రపంచ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కొత్త అవకాశాల గుర్తింపుతో మరింత సమర్ధవంతమైన వ్యాపార నిర్వహణకు ఈ మార్పులు చేపట్టినట్టు బిషప్ ఫాక్స్ సీఈఓ విన్నీ లియూ వివరించారు. తమ సొల్యూషన్స్‌కు ఎలాంటి ఢోకా లేదని, వ్యాపారం నిలకడగా ఉందని తెలిపారు. వైవిధ్యమైన గ్లోబల్ ఎకానమీ పరిస్థితుల్లో మార్కెట్ అస్థిరతను, పెట్టుబడుల ట్రెండ్స్‌ను ఏమాత్రం అలక్ష్యం చేయరాదని అన్నారు. బిషబ్ ఫాక్స్ ఆర్థిక పరిస్థితి ఎంతో ఆరోగ్యకరంగా ఉందని, రాబోయే త్రైమాసికంలో టెక్నాలజీ పెట్టుబడుల వృద్ధిపై మరింత దృష్టి సారిస్తుందని లియూ చెప్పారు. కంపెనీ నగదు నిల్వలు చాలా బలంగా ఉన్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సవాళ్లు, అస్థిరత్వం నెలకొనడం, పలు కంపెనీలు తమ ఆపరేషన్లు, ఆర్థిక వ్యూహాలను తిరిగి మదింపు చేసుకోవడం, మరి కొందరు లేఆఫ్‌లు ప్రకటిస్తున్న నేపథ్యంలో బిషప్ ఫాక్స్ నుంచి లేఆఫ్ ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2023-05-07T19:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising