ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవిష్యత్తులో మిసైల్స్‌ తయారు చేస్తాం..

ABN, First Publish Date - 2023-02-19T02:14:40+05:30

ఏరోస్పేస్‌ రంగంతో పోలిస్తే.. రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోందని.. వచ్చే పదేళ్లలో దేశీయంగా తయారవుతున్న రక్షణ ఉత్పత్తుల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మాలను ఏరోస్పేస్‌, రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ అధిగమిస్తుంది

  • రఘు వంశీ ఏరోస్పేస్‌ ఎండీ వంశీ వికాస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఏరోస్పేస్‌ రంగంతో పోలిస్తే.. రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోందని.. వచ్చే పదేళ్లలో దేశీయంగా తయారవుతున్న రక్షణ ఉత్పత్తుల్లో దాదాపు 10 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతాయని హైదరాబాద్‌కు చెందిన రఘు వంశీ ఏరోస్పేస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వంశీ వికాస్‌ చెబుతున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా పరిశ్రమల కంటే ఏరోస్పేస్‌, రక్షణ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ పెద్దది కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే..

దేశీయ రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ భవిష్యత్తులో ఎలా ఉంటుంది?

రఘు వంశీ ఏరోస్పేస్‌ ఏరోస్పేస్‌ రంగంలో ఇంజన్‌ విడి భాగాలను, రక్షణ రంగంలో క్షి పణులకు సబ్‌ సిస్టమ్స్‌, సిస్టమ్స్‌ను తయారు చేస్తోంది. దేశీయ ఏరోస్పేస్‌, రక్షణ ఉత్పత్తుల పరిశ్రమల భవిష్యత్తు ఆశావహంగా కనిపిస్తోంది. అయితే.. దేశీయంగా ఏరోస్పేస్‌ కంటే రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతుంది.

వ్యాపార పరిమాణ అంచనాలు ఏమిటీ?

వచ్చే ఐదేళ్లలో బోయింగ్‌, ఎయిర్‌ బస్‌ వంటి ఏరోస్పేస్‌ ఓఈఎంలు 400-500 కోట్ల డాలర్ల (దాదాపు రూ.41,000 కోట్లు) విలువైన విడి భాగాలను, ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరోవైపు వచ్చే 5-10 ఏళ్లలో రక్షణ రంగంలో 100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.2 లక్షల కోట్లు) విలువైన రక్షణ ఉత్పత్తులను భారత్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిలో అధిక భాగాన్ని భారత్‌లోనే ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్‌ కంపెనీలకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది?

రక్షణ రంగ ఉత్పత్తులకు దేశీయంగా హైదరాబాద్‌ కేంద్రం కానుంది. డీఆర్‌డీఓ, భారత్‌ డైనమిక్స్‌, మిధానీ వంటి రక్షణ రంగంలోని పరిశోధన, ఉత్పత్తి సంస్థలు ఇక్కడ ఉన్నాయి. బీడీఎల్‌ మిసైల్స్‌, ఇతర రక్షణ ఉత్పత్తులు, సబ్‌ సిస్టమ్స్‌, సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌లో విడి భాగాలను తయారు చేసే చిన్న సంస్థలు ఉన్నాయి. 100 దాగా మధ్య స్థాయి కంపెనీలు ఉన్నాయి. దాదాపు 10 పెద్ద కంపెనీలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రక్షణ ఉత్పత్తుల, విడి భాగాల సరఫరా వ్యవస్థ హైదరాబాద్‌లో ఉన్నంతగా మరెక్కడ లేదు. కొత్త ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధితో పాటు సాఫ్ట్‌వేర్‌పరంగా కూడా హైదరాబాద్‌ రక్షణ రంగంలో అగ్రస్థానంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో దేశీయంగా జరిగే రక్షణ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధిలో హైదరాబాద్‌ వాటా కనీసం 10 శాతం ఉంటుంది. దీని వల్ల హైదరాబాద్‌లో పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతుంది. కొద్ది సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా పరిశ్రమలను ఏరోస్పేస్‌, రక్షణ పరిశ్రమ మించుతుంది.

రఘు వంశీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటీ?

ఏరోస్పేస్‌, రక్షణ రంగాలకు సంబంధించి కంపెనీ ప్రధానంగా ఇంజన్‌ విడి భాగాలను తయారు చేస్తోంది. మిసైల్స్‌లో సబ్‌ సిస్టమ్స్‌, సిస్టమ్స్‌ను తయారు చేస్తోంది. రోల్స్‌ రాయిస్‌ వంటి కంపెనీలతో రఘు వంశీకి సంయుక్త సంస్థలు ఉన్నాయి. బోయింగ్‌, జీఈ ఏవియేషన్‌, హనీవెల్‌ వంటి కంపెనీలు మాకు ఖాతాదారులుగా ఉన్నారు. బోయింగ్‌, హనీవెల్‌ వారికి ఉత్పత్తులు సరఫరా చేయడానికి ప్రత్యేక యూనిట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాం. దీని ద్వారా 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే వీలుంది.

రక్షణ రంగంలో ఇతర విభాగాల్లోకి విస్తరించే వీలుందా?

ఏరోస్పేస్‌, రక్షణ రంగంలో వచ్చే ఐదేళ్లలో దేశంలో ప్రధాన కంపెనీల్లో ఒకటిగా అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం. ప్రస్తుతం ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ విడిభాగాలను తయారు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంజన్లను తయారు చేయాలని భావిస్తున్నాం. క్షిపణుల రంగంలో సబ్‌ సిస్టమ్స్‌, సిస్టమ్స్‌ను అందిస్తున్నాం. రానున్నకాలంలో మిసైల్స్‌ను కూడా తయారు చేయాలన్నది మా ప్రణాళిక. ఉత్పత్తుల తయారీనే కాక.. ఇన్నోవేటివ్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించాం. వచ్చే మూడేళ్లలో ఇందుకు దాదాపు రూ.200 కోట్లు వెచ్చించాలని నిర్ణయించాం.

Updated Date - 2023-02-19T02:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising