ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మ బాబోయ్.. 13 ఏళ్లు కూడా నిండకుండానే ఏడాదికి రూ.18 లక్షల జీతం.. ఇంతకీ ఈ పిల్లలు చేస్తున్న జాబ్ ఏంటో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-02-17T19:29:12+05:30

ఆ కుర్రాళ్ల వయసు 8 నుంచి 13 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.. వారు అందుకునే జీతం మాత్రం నెలకు దాదాపు లక్షన్నర.. అంతేకాదు అత్యంత లగ్జరీగా నివసిస్తూ చిన్న వయసులోనే అన్ని సౌఖ్యాలను అనుభవిస్తున్నారు.. అయితే వారు చేసే పనేంటంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ కుర్రాళ్ల వయసు 8 నుంచి 13 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.. వారు అందుకునే జీతం మాత్రం నెలకు దాదాపు లక్షన్నర.. అంతేకాదు అత్యంత లగ్జరీగా నివసిస్తూ చిన్న వయసులోనే అన్ని సౌఖ్యాలను అనుభవిస్తున్నారు.. అయితే వారు చేసే పనేంటంటే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగే భారీ వివాహాలకు హాజరై అతిథుల బంగారాన్ని అతి చాకచక్యంగా కాజేయడం (Robbery in Marriages). ఈ పని చేయడం కోసమే వారిని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ముఠా నియమించుకుంది. వారికి తగు రీతిలో శిక్షణనిచ్చింది. పెళ్లిలో ఏ దుస్తులు ధరించాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి.. ఇలా అన్ని అంశాలను శిక్షణలో పొందుపరిచారు. తాజాగా ఓ కుర్రాడు పోలీసులకు దొరికిపోయి తన ముఠా గురించి షాకింగ్ విషయాలు చెప్పాడు (Crime News).

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) బుండీలో ఓ పెళ్లి వేడుకలో ఈ 9న దొంగతనం చేస్తూ ఓ మైనర్ బాలుడు పట్టుబడ్డాడు. ఆ కుర్రాడు మూడో తరగతి వరకు చదివాడు. పోలీసులు అతడిని విచారించగా షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. తను ఓ ముఠా తరఫున పని చేస్తున్నానని, తనకు ఏడాదికి రూ.18 లక్షల జీతం అని చెప్పాడు. తనలాంటి వారు చాలా మంది ఆ ముఠాలో పని చేస్తున్నారని చెప్పాడు. ముఠా హెడ్ చెప్పే పెళ్లి వేడుకకు ఖాళీ బ్యాగ్‌తో వెళ్లి, బ్యాగ్ నిండా బంగారు నగలతో తిరిగి రావడమే తమ పని అని చెప్పాడు. వివాహ వేదికల వద్దకు లగ్జరీ కార్లలో, రైళ్లలో, విమానాలలో కూడా పంపిస్తారని చెప్పాడు.

నెలకు రూ.40 వేల జీతం.. జాబ్‌కు రిజైన్ చేసి ఇదేం పనంటూ ఎన్నోసార్లు వాపోయిన భార్య.. ప్రస్తుతం ఈ భర్త పరిస్థితి ఏంటంటే..

మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లోని రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో ఈ ముఠా అత్యధిక ఘటనలకు పాల్పడుతోంది. ఢిల్లీ, హర్యానాల్లో కూడా చోరీలు చేసింది. ఆ పిల్లల తల్లిదండ్రులతో ముఠా సభ్యులు డీల్ కుదుర్చుకుంటారు. ఓ ఏడాది జీతాన్ని ముందుగానే వారికి అందజేస్తారు. ఆ తర్వాత ఏ పెళ్లికి ఎవరు వెళ్లాలో షెడ్యూల్ పంపిస్తారు. పిల్లలు కాబట్టి పెళ్లి వేదికల వద్ద ఎవరూ అనుమానించారు. ఈ ముఠా ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయల విలువైన నగలను దొంగిలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఠా సభ్యుల కోసం గాలింపులు ప్రారంభించారు.

Updated Date - 2023-02-17T19:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising