ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold: చాక్లెట్‌ పౌడర్‌లో కలిపి...

ABN, First Publish Date - 2023-01-10T10:39:20+05:30

తిరుచ్చి విమానాశ్రయంలో 386 గ్రాముల బంగారంతో పాటు రూ.74 లక్షల నగదును కూడా కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 386 గ్రాముల బంగారం పట్టివేత

- రూ.74 లక్షల నగదు కూడా

అడయార్‌(చెన్నై), జనవరి 9: తిరుచ్చి విమానాశ్రయంలో 386 గ్రాముల బంగారంతో పాటు రూ.74 లక్షల నగదును కూడా కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని చాక్లెట్‌ పౌడర్‌(Chocolate powder)లో కలిపి తరలిస్తుండటాన్ని గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎయిర్‌పోర్టుకు సింగపూర్‌ నుంచి ఆదివారం ఒక విమానం రాగా, ఇందులో వచ్చిన విమాన ప్రయాణికుల లగేజీని కస్టమ్స్‌ అధికారులు, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు సయుంక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఒక ప్రయాణికుడు రహస్యంగా దాచి తీసుకొచ్చిన 80 వేల అమెరికన్‌ డాలర్లు, 10 వేల యూరో కరెన్సీలు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం కరెన్సీ విలువ రూ.74.19 లక్షలుగా గుర్తించారు. అలాగే దుబాయ్‌ నుంచి తిరుచ్చి ఎయిరిండియా విమానం ఒకటి రాగా అందులో వచ్చిన ప్రయాణికులను పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో మూడు చాక్లెట్‌ పౌడర్‌ డబ్బాలను తమ వెంట తీసుకొచ్చారు. వీటిని విప్పి చూడగా, అందులో మొత్తం 211 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అతని దుస్తులను విప్పి తినిఖీ చేయగా మరో 175 గ్రాముల బంగారం గుర్తించారు. మొత్తం 386 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోగా, దీని విలువ రూ.21.55 లక్షలుగా ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-01-10T10:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising