భూమిపై నూకలు ఇంకా మిగిలి ఉన్నాయంటే ఇదేనేమో.. భార్యను పొడిచేశాడు.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.. తీరాచూస్తే..
ABN, First Publish Date - 2023-02-25T20:48:11+05:30
ఆ దంపతులు (Husband and wife) ఏదో విషయమై గొడవ పడ్డారు.. భార్య మీద తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఆమెను కత్తితో పొడిచేశాడు.. అనంతరం భయంతో అతడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..
ఆ దంపతులు (Husband and wife) ఏదో విషయమై గొడవ పడ్డారు.. భార్య మీద తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఆమెను కత్తితో పొడిచేశాడు.. అనంతరం భయంతో అతడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళ చనిపోలేదు.. కొన ఊపిరితో ఉన్న ఆమెను చుట్టు పక్కల వారు రక్షించి హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ఆమె బతికిపోయింది.. భార్యను చంపేశాననుకుని భయపడి ఆత్మహత్య చేసుకున్న భర్త మాత్రం ప్రాణాలు కోల్పోయాడు (Crime News).
రాజస్థాన్లోని (Rajasthan) బుండి జిల్లా లఖేరి పట్టణానికి చెందిన 60 ఏళ్ల ఘసీలాల్ గుర్జర్ అనే వ్యక్తి తన 58 ఏళ్ల భార్య బోలాబాయితో గురువారం అర్ధరాత్రి ఏదో సమస్యపై గొడవ పడ్డాడు. తీవ్ర ఆవేశానికి లోనై భార్యపై కత్తితో దాడి చేశాడు (Husband attacked wife with knife). ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. భార్య చనిపోయిందని, తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని గుర్జర్కు భయం పట్టుకుంది. తను కూడా చనిపోవాలనుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వచ్చి రైలు ముందు దూకి ఆత్మహత్య (Suicide)చేసుకున్నాడు.
రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేసినా రెండ్రోజుల తర్వాత మళ్లీ అదే నెంబర్ నుంచి కాల్.. అదే అతడి ప్రాణం తీసేసింది.. ఇంతకీ అసలేం జరిగిందంటే..
ఉదయం చుట్టు పక్కల వారు రక్తపు మడుగులో పడి ఉన్న బోలాబాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను కాపాడారు. చికిత్స అనంతరం డిశ్చార్జి కూడా చేశారు. ఇంతలో గుర్జర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. దీంతో బోలాబాయి విషాదంలోకి వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
Updated Date - 2023-02-25T20:48:12+05:30 IST