Hyderabad : అన్న భార్యతో అక్రమ సంబంధం.. పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య!
ABN, First Publish Date - 2023-09-06T20:08:21+05:30
మూడో కంటికి తెలియకుండా సొంత అన్న భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.! ఇంకెన్నిరోజులు ఇలాగని అన్నను వదిలేయమని వదినకు చెప్పాడు! ..
మూడో కంటికి తెలియకుండా సొంత అన్న భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.! ఇంకెన్నిరోజులు ఇలాగని అన్నను వదిలేయమని వదినకు చెప్పాడు! అంతేకాదు పెళ్లి కూడా చేసుకుంటానని మాటిచ్చాడు! అయితే పెళ్లికి చేసుకోనని ఆమె చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు మరిది.! ఈ ఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది.
ఇదీ అసలు కథ..?
బోయిన్‌పల్లి స్టేషన్ పరిధిలోని అలీ కాంప్లెక్స్‌లో అన్నయ్య శివ, సోదరుడు ప్రదీప్ కుమార్‌లు కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. పెళ్లికాని ప్రదీప్ తన అన్న భార్య రీతూతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఈ బంధం కొనసాగుతోంది. అయితే.. అన్నయ్య శివను వదిలి.. తనను వివాహం చేసుకోవాలని కొద్దిరోజులుగా వదినపై ఒత్తిడి తెచ్చాడు ప్రదీప్. రీతూ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. పదే పదే అడిగినా పెళ్లికి నిరాకరిస్తోందని తీవ్ర మనస్తాపానికి గురై ఇవాళ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2023-09-06T20:08:21+05:30 IST