ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇనుప రాడ్డుతో తలపై 26 సార్లు కొట్టి మరీ నా భర్తను చంపేశా.. పోలీసుల ముందు నిజం ఒప్పుకున్న ఈ భార్య కథేంటంటే..

ABN, First Publish Date - 2023-01-21T16:24:35+05:30

ఆ యువతి చదువుకునే రోజుల్లోనే ఓ యువకుడిని ప్రేమించింది.. పెద్దల బలవంతంతో మరో వ్యక్తిని వివాహం చేసుకుంది.. మనసులో మరో వ్యక్తి ఉండడంతో భర్తతో సఖ్యంగా ఉండలేకపోయింది.. పెళ్లి తర్వాత కూడా ప్రియుడితో బంధం కొనసాగించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువతి చదువుకునే రోజుల్లోనే ఓ యువకుడిని ప్రేమించింది.. పెద్దల బలవంతంతో మరో వ్యక్తిని వివాహం చేసుకుంది.. మనసులో మరో వ్యక్తి ఉండడంతో భర్తతో సఖ్యంగా ఉండలేకపోయింది.. పెళ్లి తర్వాత కూడా ప్రియుడితో బంధం కొనసాగించింది.. చివరకు భర్తను చంపేసి ప్రియుడితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది.. స్వయంగా భర్తను ఇనుప రాడ్డుతో 26 సార్లు కొట్టి హత్య చేసింది.. ఆ తర్వాత రకరకాల కట్టుకథలు అల్లింది.. చివరకు పోలీసుల ముందు నిజం ఒప్పుకుని జైలు పాలైంది.. గుజరాత్‌లోని (Gujarat) నదియాడ్‌లో ఈ ఘటన జరిగింది (Crime News).

నడియాడ్ జిల్లా కపద్వాంజ్‌కు చెందిన కముబెన్ అనే యువతికి రెండేళ్ల క్రితం ఖేంగార్‌భాయ్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అప్పటికే కుముబెన్ మరో యువకుడితో ప్రేమలో ఉంది. పెద్దలు అంగీకరించకపోవడంతో బలవంతంగా ఖేంగార్‌ను వివాహం చేసుకుంది. అయితే భర్తతో సఖ్యంగా కాపురం చేయలేకపోయింది. వివాహం తర్వాత కూడా ప్రియుడితో సంబంధం కొనసాగించింది. ఎప్పటికైనా భర్తకు తెలిసిపోతుందనే భయంతో అతడిని అడ్డు తప్పించాలనుకుంది. పొలంలోకి వెళ్లిన భర్తను అక్కడే అంతమొందించాలని గతేడాది పథకం రూపొందించింది. పొలంలో మంచంపై నిద్రపోతున్న భర్త తలపై ఇనుపరాడ్డుతో 26 సార్లు కొట్టి చంపేసింది (Wife killed Husband).

అనంతరం భర్త మృతదేహాన్ని, అతడి బైక్‌పై ఉంచి పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. తర్వాత ఊర్లోకి వెళ్లి పొలంలో ఉన్న తన భర్తపై కొందరు దుండగులు దాడి చేశారని, పెట్రోల్ పోసి నిప్పు అంటించేశారని చెప్పింది. పోలీసులకు కూడా అలాగే ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో వారికి దోపిడీకి సంబంధించిన ఆనవాళ్లేం కనిపించలేదు. దీంతో వారికి కుముబెన్‌పై అనుమానం కలిగింది. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో ఆమె నిజం అంగీకరించింది. కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.

Updated Date - 2023-01-21T16:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising