విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంది.. భార్యపై ఓ భర్త పెట్టిన కేసు ఇదీ.. అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-02-11T14:55:17+05:30
వారిద్దరికీ ఏడాది క్రితమే పెళ్లైంది.. ఏడాది లోపే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.. దీంతో ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది.. తనతో పాటు కొంత డబ్బు, బంగారం కూడా తీసుకుపోయింది.. మరో నెల రోజుల్లో ఓ వ్యక్తిని రెండో వివాహం (Second Marriage) చేసుకుంది
వారిద్దరికీ ఏడాది క్రితమే పెళ్లైంది.. ఏడాది లోపే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.. దీంతో ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది.. తనతో పాటు కొంత డబ్బు, బంగారం కూడా తీసుకుపోయింది.. మరో నెల రోజుల్లో ఓ వ్యక్తిని రెండో వివాహం (Second Marriage) చేసుకుంది.. షాకైన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భార్య మరొకరిని వివాహం చేసుకుందని తెలిపాడు.. అలాగే తన ఇంట్లోని బంగారం, డబ్బు పట్టుకెళ్లి పోయిందని ఫిర్యాదు చేశాడు.
రాజస్థాన్‌లోని (Rajasthan) అజ్మీర్‌కు సమీపంలోని జోటయకి చెందిన విష్ణు ఖరోల్ ఏడాది క్రితం రేఖ అనే అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ పది నెలలు కలిసి నివసించారు. తర్వాత విభేదాలు తలెత్తడంతో రేఖ తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త ఇంటి నుంచి వెళ్లిపోతూ రూ.2 లక్షల విలువైన నగలు, రూ.లక్ష నగదు తీసుకెళ్లింది. విషయం తెలియగానే విష్ణు.. రేఖ పుట్టింటికి వెళ్లాడు. అయితే రేఖ అతనితో వెళ్లడానికి నిరాకరించింది. నగలు, నగదు కూడా ఇవ్వలేదు.
ఎదురింటి ఆంటీ వేధింపులు.. పదో ఫ్లోర్ నుంచి దూకేసిన బాలిక.. ఆత్మహత్యకు ముందు అన్నకు ఫోన్ చేసి..
తర్వాత నెల రోజులకే మరో వ్యక్తిని రేఖ వివాహం చేసుకుంది. విషయం తెలుసుకున్న విష్ణు షాకయ్యాడు. చట్టబద్ధంగా తన విడాకులు తీసుకోకుండానే భార్య మరో వివాహం చేసుకోవడంతో విష్ణు పోలీసులను ఆశ్రయించాడు. ఆమెపై దొంగతనం కేసు కూడా పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Updated Date - 2023-02-11T14:55:18+05:30 IST