కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చీకటి లేఖ

ABN, First Publish Date - 2023-10-30T00:52:41+05:30

నీకు ఎంతకూ నిద్ర పట్టదు ఏదో రాయాలని కిటికీ తెరిచి కూచుంటావ్‌ కళ్ల ముందర పాకే చెట్ల నీడల మధ్య ఏదో కదులుతుంది...

చీకటి లేఖ

నీకు ఎంతకూ నిద్ర పట్టదు

ఏదో రాయాలని

కిటికీ తెరిచి కూచుంటావ్‌

కళ్ల ముందర పాకే చెట్ల నీడల

మధ్య ఏదో కదులుతుంది

అంతరంగంలో దృశ్యాలు కొన్ని

హడావుడిగా పరుగులు తీస్తుంటాయి

సముద్రాలు ఉప్పొంగిన హోరు

సూర్యుడు చీకటి పంచ కింద

సేదదీరిన నిశ్శబ్దం

ఎందుకు రాయాలనే ప్రశ్న

ఎవరికోసమనే సందేహం

నీకు జవాబులు దొరకవు

కలం నీ చేతివేళ్ల మధ్య

సందిగ్ధావస్థలో పడి

నలుగుతూ.. నిరీక్షిస్తుంటుంది

ఇంతలో

నీకెవరో గుర్తొస్తారు

నీ మది ముంగిట కొన్ని పరిమళాలను

వెదజల్లిపోతారు

చల్లని సాయంత్రాలు

చిక్కని సందేశాలు నిన్ను రహస్యంగా

పలకరిస్తాయి

అరమోడ్చిన నీ కనురెప్పలపై

ఏదో రాసిపోతాయి

కిటికీ రెక్క తెరిచే వుంటుంది

నీ వేళ్ల మధ్య బిగించిన కలం

కాగితపు నుదుటి మీద

ప్రేమగా ముద్దాడుతుంది

సునీత గంగవరపు

94940 84576

Updated Date - 2023-10-30T00:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising