వెలుగు పూల పండుగ
ABN, First Publish Date - 2023-11-12T01:12:14+05:30
చీకటిలో చిరు దివ్వెలు వెలిగించుటే పండుగోయి అజ్ఞానపు అంధకారం విడుచుటనే పండుగోయి...
చీకటిలో చిరు దివ్వెలు
వెలిగించుటే పండుగోయి
అజ్ఞానపు అంధకారం
విడుచుటనే పండుగోయి
నరకాసుర సంహారం
జన జీవన సంతోషం
సత్యభామ విరోచితం
జగతి శాంతి కేతనం
రాజకీయ రంగులు
ఎన్నెన్నో హంగులు
ఈ సారి పండుగలో
ప్రత్యేక చిందులు
నాడు నేడు ఎప్పుడైనా
సుభిక్షమే పండుగోయి
ఇష్టాల వెలుగు కళ్ల
హృది తలుపులు తెరవండోయ్
మమతల మతాబులే
ముదముగ విరజిమ్మునోయి
తిమిరంతో సమరమే
వెలుగు పూల నిచ్చునోయి
కటుకోఝ్వల రమేష్
Updated Date - 2023-11-12T01:12:16+05:30 IST