ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN, First Publish Date - 2023-02-25T00:07:20+05:30

లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపులో ఆలస్యం అవుతున్న క్రమంలో ఐటీడీఏ అధికారులపై కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సత్తుపల్లిలోని శాఖా గ్రంథాలయం శంకుస్థాపనకు హాజరైన ఆయన వేంసూరు రోడ్‌లోని నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సందర్శించారు.

అధికారులను ప్రశ్నిస్తున్న కలెక్టర్‌ వీపీ గౌతమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తుపల్లిరూరల్‌, ఫిబ్రవరి 24: లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపులో ఆలస్యం అవుతున్న క్రమంలో ఐటీడీఏ అధికారులపై కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సత్తుపల్లిలోని శాఖా గ్రంథాలయం శంకుస్థాపనకు హాజరైన ఆయన వేంసూరు రోడ్‌లోని నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సందర్శించారు. ఏళ్లుగా నిర్మిస్తున్న ఈ జీప్లస్‌2 నిర్మాణాలను లబ్ధిదారులకు కేటాయించినా పెండింగ్‌లోని పనులు ఎప్పుడు పూర్తి చేస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. మూడు నెలల నుంచి పనులు త్వరలోనే పూర్తి చేస్తామని కథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న 48 ఇళ్లు పాడవుతున్నాయని, త్వరగా పనులన్నీ పూర్తి చేసిన లబ్ధిదారులకు ఇవ్వాలని, వీటిపై పర్యవేక్షణ ఉంచాలని ఆర్డీవో సూర్యనారాయణను ఆదేశించారు. ఈనెల 17న 96మందికి కేటాయించిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల వద్ద నెలకొన్న సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని మునిసిపల్‌ కమిషనర్‌ కే.సుజాతను ఆదేశించారు. అయితే వేంసూరు రోడ్‌తో పాటు జేవీఆర్‌ పార్క్‌ సమీపంలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్‌ వైరింగ్‌, ఇతరత్రా సామాన్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకోవడంతో పనులన్నీ ఆలస్యం అవుతుందని, వచ్చేనెల 10వ తేదీకల్లా పనులు పూర్తవుతాయని ఐటీడీఏ ఏఈ సుబ్బారాజు ఆంధ్రజ్యోతికి వివరణ ఇచ్చారు.

తప్పులు దొర్లకుండా రిజిస్ర్టేషన్‌ చేయించండి

సత్తుపల్లి మండలంలో జీవో 59కింద ధరఖాస్తు చేసి పూర్తి పైకం చెల్లించిన 36మందికి తహసీ ల్థార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ను పూర్తి చేశారు. ఈక్రమంలో సత్తుపల్లి పర్యటనలో భాగంగా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పరిశీలించారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇటీవల గంగారంలోని 133సర్వే నెంబర్‌లో భూముల రిజిస్ర్టేషన్‌లో అవకతవకలు చోటుచేసుకున్న నేపధ్యంలో కలెక్టర్‌ రికార్డులను పరిశీలించడంతో ఇంకా ఎన్ని వ్యవహరాలు బయటకు వస్తాయని పాఠకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-02-25T00:07:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising