ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దండకారణ్యం శతృదేశమా?

ABN, First Publish Date - 2023-05-20T02:03:58+05:30

ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడులు చేస్తున్నది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడులు చేస్తున్నది. ఈ దాడులు మొదట 2021 జూన్‌ 19న, ఆ తర్వాత 2022 ఏప్రిల్‌ 14, 15 తేదీల మధ్య రాత్రి బీజాపూర్‌, సుక్మా జిల్లాల మధ్య ఉన్న ఐదు గ్రామాల మీద డ్రోన్లతో బాంబులు వేశారు. మళ్లీ 2023 జనవరి 11న తెల్లవారుజామున అదే ప్రాంతంలో భారత ప్రభుత్వ హెలికాప్టర్లలో కోబ్రా కమాండోస్‌, సిఆర్‌పిఎఫ్‌ సైనికులు వెళ్లి బాంబులు వేశారు, కాల్పులు జరిపారు. మరోసారి ఏప్రిల్‌ 7న ఇలాగే బాంబు దాడులు చేశారు.

రాజ్యాంగంలో ఆదివాసులకు ఉన్న ప్రత్యేక రక్షణ చట్టాలకు భిన్నంగా ఆ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. గ్రామసభల నిర్ణాయకతను పరిగణలోకి తీసుకోకుండా ఆ ప్రాంతాల్లో గనుల తవ్వకం, పర్యాటకం, సైనిక క్యాంపుల ఏర్పాటుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకే ఆదివాసులు గత మూడేళ్లుగా సిలింగేర్‌లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శాంతియుత ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా హస్‌దేవ్‌ అడవులను కార్పొరేట్ల నుంచి కాపాడుకోడానికి ఏడాదికిపైగా అక్కడి ఆదివాసులు పోరాడుతున్నారు. దాన్ని లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 20న హస్‌దేవ్‌ అభయారణ్యాల్లో మూడు వేల ఎకరాలను అదానికి ఇచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ మొత్తంలో ఆదివాసుల అస్తిత్వ సమస్య ఉన్నది. ప్రభుత్వ అభివృద్ధి నమూనా వల్ల ఈ ఘర్షణ జరుగుతున్నది. ఈ సమస్యపై విరసం ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకా హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం(బాగ్‌లింగంపల్లి) షోయబ్‌ హాల్‌లో విస్తృత చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నది.

– అరసవిల్లి కృష్ణ (అధ్యక్షుడు)

రివేరా (కార్యదర్శి)

విప్లవ రచయితల సంఘం

Updated Date - 2023-05-20T02:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising