ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలుగుజిలుగుల మధిర

ABN, First Publish Date - 2023-02-25T00:08:33+05:30

ఒకప్పుడు బోసిపోయిన మధిర పట్టణంలోని పలు కూడళ్లు నేడు విద్యుత్‌ వెలుగు జిలుగులతో అందమైన ఫౌంటేన్లతో విరజిల్లుతున్నాయి.

ఆత్కూరు సెంటర్‌ లో ఏర్పాటు చేసిన పౌంటేన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధిరటౌన్‌, ఫిబ్రవరి 24: ఒకప్పుడు బోసిపోయిన మధిర పట్టణంలోని పలు కూడళ్లు నేడు విద్యుత్‌ వెలుగు జిలుగులతో అందమైన ఫౌంటేన్లతో విరజిల్లుతున్నాయి. మధిర మునిసిపాలిటీ గా అప్‌గ్రేడ్‌ అయిన తరువాత ప్రధాన కూడళ్లు, రోడ్లును సుందరంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు వీధి దీపాలు కూడా సరిగా లేని చోట నేడు డివైడర్లు నిర్మించి, వాటి మధ్య అందమైన బటర్‌ప్లై లైట్లు, ఆ స్తంభాలకు స్ట్రిప్‌ లైట్లను ఏర్పాటు చేశారు. ఒకప్పుడు బోసిపోయినట్టు ఉండే అంబేద్కర్‌ సెంటర్‌ లో దాదాపు 30లక్షల తో రాజ్యాంగ నిర్మాత కాంస్య విగ్రహం పెట్టి చుట్టూ స్టీల్‌ రేలింగ్‌, వాటర్‌ పౌంటేన్‌, ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. అత్కూరు సెంటర్‌లో సర్కిల్‌ నిర్మించి ఎల్‌ఈడీ లైట్లతో కూడిన ఫౌంటేన్‌ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా పెద్ద పెద్ద హైమాస్డ్‌ లైట్లను పెట్టడంతో రాత్రి కూడా పగలను తలపించేవిధంగా ఉంది. అనేక సంవత్సరాల తరువాత పట్టణానికి వచ్చిన వారు ఇది మధిరేనా అనుకునే విధంగా వెలుగులీనూతోంది.

Updated Date - 2023-02-25T00:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising