ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాక్షసత్వం

ABN, First Publish Date - 2023-05-20T01:52:40+05:30

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఉభయతెలుగురాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైన అంశం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఉభయతెలుగురాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైన అంశం. ఘటన జరిగిన తీరు, అనేక పరిణామాల అనంతరం సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేపట్టడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. మీడియా కూడా జరుగుతున్నదానిని, తెలిసిన విషయాన్ని ప్రజలకు తెలియచెప్పడానికి ప్రయత్నిస్తున్నది. దర్యాప్తు చివరిదశకు చేరుకుంటూ, సీబీఐ దూకుడు పెంచిన స్థితిలో కేసు ప్రాధాన్యత మరింత పెరిగింది. ముఖ్యంగా, ఈ కేసు నిందితుల్లో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఉండటం, ఆయన పలుమార్లు సీబీఐ విచారణ తప్పించుకోవడం మీడియా దృష్టికి కారణం. మూడురోజుల క్రితం ఆఖరునిముషంలో ఆయన సీబీఐ విచారణకు గైర్హాజరై, కడప వెళ్ళిపోయినప్పుడు సీబీఐ బృందం కూడా అంతేవేగంగా కడప చేరుకొని, ఆయన లేకపోవడంతో 19వ తేదీన విధిగా విచారణకు హాజరుకావాలంటూ ఇంట్లో నోటీసు ఇచ్చి మరీ వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన ఇంటివద్దనే మీడియా మోహరించి లైవ్‌కవరేజ్‌ ఇస్తున్నది. ఈ దశలో అవినాష్‌ రెడ్డి బంధువులు, అనుచరులు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి వాహనం, దాని విలేకరులను లక్ష్యంగా చేసుకున్నారు. మార్గమధ్యంలో చానెల్‌ వాహనాన్ని ధ్వంసంచేశారు, సిబ్బందిని రక్తం ఓడేట్టుగా కొట్టారు. హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘాతుకం ఈ కేసు నిందితుల పతనవైఖరులకు అద్దంపడుతున్నది.

సీబీఐ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవినాష్‌ రెడ్డి, ఆఖరునిముషంలో వాహనాన్ని మలుపుతిప్పి జాతీయ రహదారి పట్టడానికి ఆయన తల్లి అనారోగ్యం కారణం కావచ్చు. కానీ, ఆయన మార్గాన్ని మార్చుకోవడం, సీబీఐ అధికారులు కూడా కొంతవరకూ వెంబడించడం సహజంగానే మీడియాకు ముఖ్యమైన విషయాలు. అవినాష్‌ తీరుపై సీబీఐ ఏం చేయబోతున్నదన్నది అటుంచితే, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య అనేక అనుమానాలకు ఆస్కారం కలిగించే తీరులో జరిగింది. ఆయన ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి చెందిన ప్రముఖుడు. ఈ హత్యలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కుటుంబం దాని సన్నిహితుల పాత్ర గురించి అనేక అనుమానాలు ఉన్నాయి. అందువల్ల, తెలుగురాష్ట్రాలకే కాదు, యావత్‌ భారతదేశ ప్రజలకు ఈ కేసు విషయంలో ఆసక్తి ఉంటుంది. తదనుగుణంగా సమాచారాన్ని పొందే హక్కు ప్రజలకు ఎంత ఉందో, దానిని అందజేయాల్సిన బాధ్యత మీడియాకూ ఉంటుంది. తనకు తెలిసినదానిని ప్రజలకు నివేదించే హక్కు కూడా మీడియా ఉంది. వివేకాహత్యకేసులో వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తున్నది. మీడియా సమాచారం తప్పు అని భావించినప్పుడు దానిని ఖండించవచ్చు, ఏది నిజమో చెప్పవచ్చు. ఎలాగూ సొంత మీడియా ఉన్నది కనుక నచ్చినదానిని ప్రచారం చేసుకోవచ్చు. కానీ, ఇలా వాహనాలను ధ్వంసం చేసేవరకూ, విలేకరులపై భౌతికదాడులు పాల్పడేవరకూ దిగజారారంటే సదరు నిందితులు, అనుచరులు, వెనుక ఉన్న పెద్దలు ఎంత నిరాశానిస్పృహల్లో ఉన్నారో, వారి రాజకీయ సంస్కృతి, ధోరణి ఎంత అథమస్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతున్నది. సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం కూడా వారిని నిలువునా కుదిపేస్తున్నది, తన కర్తవ్యాన్ని నిర్వహించనీయకుండా దాడులతో మీడియాను దూరంగా ఉంచాలన్న దురాలోచనకు లోనుచేస్తున్నది. మీడియా చెప్పినంతమాత్రాన న్యాయస్థానంలో తీర్పులు మారిపోవు. నిజం తమవైపు ఉన్నప్పుడు న్యాయం కూడా తమ పక్షానే ఉంటుంది. కానీ, ఇంతగా బెదిరిపోతూ, ఆవేశంతో ఊగిపోతూ దాడులకు ఉపక్రమిస్తే ప్రజల్లో ఇప్పటికే ఉన్న అనుమానాలు మరింత బలపడతాయి.

ఒక రాష్ట్రంలో ఒక దారుణ ఘటన జరిగినప్పుడు, అక్కడి పరిస్థితులవల్లనో, ఇతరత్రా కారణాలవల్లనో కేసుకు సంబంధించిన కొన్ని ప్రక్రియలు మరొక రాష్ట్రంలో జరగవచ్చు. వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు, ఎక్కడో ఉన్న రాజకీయసంస్కృతిని ఇక్కడకు తెచ్చి ఇలా వీరంగాలు వేయడం సరికాదు. ఇటువంటివారినుంచి ఉన్నతమైన నడవడికను ఎలాగూ ఆశించలేం కానీ, అక్కడి ఉద్రిక్తతలు, వైరాలు హైదరాబాద్‌కు బదలాయించి పూర్తి ఫ్యాక్షన్‌ తరహాలో ఇక్కడి విలేకరులు, ఇక్కడి ప్రజలు బెదిరిపోయేట్టుగా చేస్తున్న వాతావరణాన్ని మాత్రం ప్రభుత్వం సహించకూడదు.

Updated Date - 2023-05-20T01:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising