ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ ఇల్లు

ABN, First Publish Date - 2023-02-20T00:39:19+05:30

నాకొక రాళ్ళతో నేసిన ఇల్లుండేది అది నా తలపై కాసిన మొట్టమొదటి నీడ ఇంటి ముందు నిప్పుపువ్వు కాపలా అనేక ఏళ్ళు ఆ ఇల్లు నాకు ఆతిథ్యమిచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాకొక రాళ్ళతో నేసిన ఇల్లుండేది

అది నా తలపై కాసిన మొట్టమొదటి నీడ

ఇంటి ముందు నిప్పుపువ్వు కాపలా

అనేక ఏళ్ళు

ఆ ఇల్లు నాకు ఆతిథ్యమిచ్చింది

మైదానాలు తీయగా పిలిచే సరికి

రాతి ఇంట్లోంచి మట్టి ఇంట్లోకి మారాను

ఇల్లంతా పచ్చి వాసన

గలగల మంటూ కాళ్ళల్లో తిరుగాడుతూ నదులు

వదిలి వచ్చిన అడవి ఒక పచ్చని జ్ఞాపకం

ఇక చాలు

ఇదే ఆఖరి ఇల్లనుకున్నాను

రోజులు ఆకుల్లా రాలిపడే కొద్దీ

మట్టి ఇల్లు బోసిపోయింది

ఇంటి నిండా సందడి చేసిన నదులు

పల్లంలోకి వరుసలు కట్టాయి

కొన్ని రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాయి

ఎప్పుడూ లేనిది

పాదాలకిప్పుడు మట్టితో పడడం లేదు

ప్రాణం పోసి అల్లుకున్న గూడులో

ఒంటరి సాలీడులా మిగిలిపోలేను

నేనొక ఇంటి కోసం చూస్తున్నాను

ఉన్నంతలో ఒక తడివాకిలి

అమ్మపటం పెట్టుకోవడానికో గోడ

డాబా మీద పిట్టలు వాలేందుకు ఒక తీగ

వెలుగో వెన్నెలో

అప్పుడప్పుడూ చిన్న ఆకాశం ముక్కో

లోపలికి జొరబడ్డానికి ఒక కిటికీ

నాలుగు గుండెలు పట్టేంత ఇల్లు

నాకు లేకపోయినా పర్లేదు

నా పుస్తకాలకు గుప్పెడు చోటుండే

ఇల్లు కోసం వెతుకుతున్నాను

చివరికది ప్లాస్టిక్‌ ఇల్లయినా సరే.

సాంబమూర్తి లండ

96427 32008

Updated Date - 2023-02-20T00:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising