ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గులాగ్‌

ABN, First Publish Date - 2023-10-23T01:39:04+05:30

కథలో రెండువైపులా ఒకరి వేళ్ళు మరొకరి వైపు చూపిస్తుంటే వక్రీకృత సత్యాల చెరసాలలో అసలు నిజం చిక్కుబడింది ఎవడూ తేల్చిచెప్పడేం...

కథలో రెండువైపులా

ఒకరి వేళ్ళు మరొకరి వైపు చూపిస్తుంటే

వక్రీకృత సత్యాల చెరసాలలో అసలు నిజం చిక్కుబడింది

ఎవడూ తేల్చిచెప్పడేం

నేనిప్పుడు నిర్బంధ శిబిరంలో శాశ్వత శిక్ష అనుభవిస్తున్నానా!

బాధ-వేదన-కోపం-వివక్ష

నాకు తరాలుగా సంక్రమించిన అనుభూతులు

నాది శరణార్థుల కుటుంబంలో పుట్టిన జాతి వారసత్వం

తెగిపడుతున్న పసిపిల్లల మొహాల్లో భావోద్వేగాల్ని చదవగలను

ఎవర్ని కదిపినా నాది పవిత్ర భూమి అంటాడు

ఎవడ్ని చూసినా నిరంతర రక్త కవాతులు చేస్తూ కనబడతాడు

ఇంటి నుంచి బితుకు బితుకుమంటూ బయటకు చూస్తే

స్వేచ్ఛా చమోమిలే పూలమొక్కల మధ్య ఎవరో పాతిన బారికేడ్లు

నేను మానసిక వ్యాధితో బాధపడుతున్నానా!

నాది పోరాట భూభాగమేనని ఇంటా బయటా రుసరుసలు

ప్రతీ ఇంటిలోనూ పగలూ రాత్రీ వినబడుతున్న విముక్తి పాటలు

ద్రాక్షలు పండే నా భూమిని రాత్రి నిద్రపోతున్నప్పుడు

బలవంతంగా కాజేస్తారేమోనని పీడకలలు

ప్రతీసారీ నేనే ఎందుకు రక్తమోడుతున్నానో జవాబులు దొరకని ప్రశ్నలు

సంఘర్షణ తప్ప

నాకేమీ పెద్దపెద్ద కోరికలేమీ లేవు

ఎప్పటిలాగే స్వేచ్ఛగా స్పానిష్‌ బంతిపూలను పెంచుకోవాలని

తాత తండ్రులు దున్నిన భూమిలో స్వేచ్ఛగా తిరుగాడాలని ఉంది

ఇక్కడే ఒక ఒలీవ మొక్కలా మళ్ళీ మళ్ళీ పుట్టాలనిఉంది

పసిపాపలకు పాలూ నీళ్ళూ ఇవ్వనీయకపోతేనేం..

శవాలను మోసుకెళ్లడానికి గోనె సంచులను సరఫరా చేస్తున్న

దయగల ప్రభువులకు వందనాలు

తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌

95380 53030

Updated Date - 2023-10-23T01:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising