ఈ వారం వివిధ కార్యక్రమాలు 09 10 2023
ABN, First Publish Date - 2023-10-09T03:18:38+05:30
గద్దర్ స్ఫూర్తి సంచిక, సుద్దాల హనుమంతు-జానకమ్మ అవార్డు, ‘విమర్శా పునర్నవం’ ప్రత్యేక సంచిక, రొట్టమాకురేవు కవిత్వ అవార్డులు, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం..
గద్దర్ స్ఫూర్తి సంచిక
అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుజన కెరటాలు గద్దర్ స్ఫూర్తి సంచిక ఆవిష్కరణ సభ అక్టోబర్ 10 సా.5గంటలకు హైదరా బాద్ కేంద్ర విశ్వవిద్యాలయం అంబే డ్కర్ ఆడిటోరియంలో జరుగుతుంది. సభలో గోరటి వెంకన్న, లెల్లే సురేశ్, లక్ష్మినారాయణ, శ్రీపతి రాముడు, కె.వై. రత్నం తదితరులు పాల్గొంటారు.
కోయి కోటేశ్వరరావు
సుద్దాల హనుమంతు-జానకమ్మ అవార్డు
అరుణోదయ విమలక్క స్వీకరించే సుద్దాల హను మంతు - జానకమ్మ పురస్కార సభ అక్టోబరు 13 సా.6గంటలకు సుందరయ్య కళా నిలయం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో జస్టిస్ జి. రాధారాణి, ఆర్ నారాయణ మూర్తి, చింతకింది కాశీం, అయినంపూడి శ్రీలక్ష్మీ, కోయి కోటేశ్వరరావు, ఉత్తేజ్, సుద్దాల అశోక్ తేజ పాల్గొంటారు. యగమాటి జగన్ మోహన్‌రెడ్డికి ప్రత్యేక సన్మానం జరుగుతుంది.
సుద్దాల ఫౌండేషన్
‘విమర్శా పునర్నవం’ ప్రత్యేక సంచిక
రాచపాళెం చంద్రశేఖరరెడ్డిపై ‘విమర్శా పున ర్నవం’ ప్రత్యేక సాహిత్య సంచిక, ‘మన నవ లలు’, ‘మన కథానికలు’ విమర్శా గ్రంథాల ఆవిష్కరణ సభ అక్టోబరు 14 ఉ.9.30గంట లకు డ్రామాహాలు, ప్రభుత్వ కళాశాల, అనంతపురంలో జరుగుతుంది. సభలో పెనుగొండ లక్ష్మీనారాయణ, మాచిరెడ్డి రామ కృష్ణారెడ్డి, జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొంటారు.
రాచపాళెం స్నేహితులు
రొట్టమాకురేవు కవిత్వ అవార్డులు
రొట్టమాకురేవు అవార్డుల సభ అక్టోబర్ 15 సా.6గంటలకు, రవీం ద్రభారతి, హైదరాబాదులో జరుగుతుంది. షేక్ మహమ్మద్ మియా స్మారక అవార్డు ప్రసేన్; పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డు పెనుగొండ సరసిజ; కె.ఎల్ నర్సింహారావు స్మారక అవార్డు తెలుగు వెంకటేష్, సుంకర గోపాలయ్య స్వీకరిస్తారు. సభలో కె. శివారెడ్డి, గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్ పాల్గొంటారు.
యాకూబ్
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం
రంగినేని ఎల్లమ్మ పురస్కారానికి 2021, 2022, 2023 సంవత్సరాలలో వచ్చిన కవితా సంపుటాలను పంపగోరుతున్నాము. రూ.25వేలు నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రం ఉంటాయి. ఐదు ప్రతులను నవంబరు 15లోపు చిరునామా: రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం, రంగినేని సుజాతా మోహన్ రావు ఎడ్యుకేషనల్ ్క్ష చారిటబుల్ ట్రస్ట్, బాలాజీ నగర్, సిరిసిల్ల - 505301కు పంపాలి. వివరాలకు: 94416 77373.
మద్దికుంట లక్ష్మణ్
Updated Date - 2023-10-09T03:18:38+05:30 IST