ఈ వారం వివిధ కార్యక్రమాలు 11 09 2023
ABN, First Publish Date - 2023-09-11T00:11:49+05:30
ఉదారి నాగదాసు స్మారక సాహితీ పురస్కారం, ‘మిరాబ్’ కవిత్వ సంపుటి, మూడు పుస్తకాల ఆవిష్కరణ, ‘సమరభేరి’ కవితా సంపుటి, ‘స్త్రీల రచనలు-విభిన్న దృక్పథాలు: సమాలోచన’ అంశంపై రెండు రోజుల సదస్సు...
ఉదారి నాగదాసు స్మారక సాహితీ పురస్కారం
ఉదారి నాగదాసు స్మారక సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాదికి ఏనుగు నరసింహారెడ్డి స్వీకరిస్తారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబరు 24న ఆదిలాబాద్‌లో జరుగుతుంది. వివరాలకు: 9441413666.
ఉదారి నారాయణ
‘మిరాబ్’ కవిత్వ సంపుటి
ఖాజా అఫ్రిది కవిత్వ సంపుటి ‘మిరాబ్’ ఆవిష్కరణ సభ సెప్టెం బరు 15 సా.5.47గంటలకు రవీంద్రభారతి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో కె. శ్రీనివాస్, మామిడి హరికృష్ణ, కవి యాకూబ్, స్కైబాబ, వేణు ఉడుగుల, మెర్సీ మార్గరెట్, అన్వర్ పాల్గొంటారు.
సారంగి ఫౌండేషన్
మూడు పుస్తకాల ఆవిష్కరణ
విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబరు 16 సాయంత్రం విశాఖ పౌర గ్రంథాలయంలో అడపా రామకృష్ణ కథా సంపుటి ‘దేశమే గతి బాగు పడునోయ్’; సంఘమిత్ర కథా సంపుటి ‘అంతర్దర్శనం’, నవల ‘మజిలీ’ ఆవిష్కృతమవుతాయి. సభలో వి.వి. రమణ మూర్తి, చొక్కర తాతారావు పాల్గొంటారు.
విశాఖ రచయితల సంఘం
‘సమరభేరి’ కవితా సంపుటి
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తెలంగాణ రచ యితల సంఘం జంటనగరాల శాఖ ఆధ్వర్యంలో పెరంబుదూరు నారాయణ రావు కవిత్వ సంపుటి ‘సమరభేరి’ ఆవి ష్కరణ సభ సెప్టెంబరు 12 మ.2 గం.లకు రవీంద్ర భారతి, హైదరా బాద్‌లో జరుగుతుంది. సభలో నందిని సిధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, మామిడి హరికృష్ణ, మసన చెన్నప్ప, అమ్మంగి వేణుగోపాల్, పి. లక్ష్మినారా యణ, దాస్యం సేనాధిపతి, బెల్లంకొండ సంపత్‌కుమార్ పాల్గొంటారు.
తెలంగాణ రచయితల సంఘం
‘స్త్రీల రచనలు-విభిన్న దృక్పథాలు: సమాలోచన’ అంశంపై రెండు రోజుల సదస్సు
అన్వేషి, రీసర్చ్ సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్, ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా ‘స్త్రీల రచనలు-విభిన్న దృక్పథాలు: సమాలోచన’ అనే అంశంపై రెండు రోజులు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ప్రభుత్వ సిటీ కళాశాల, హైద రాబాద్ ప్రాంగణంలో ఆజామ్ హాల్‌లో జరిగే ఈ సదస్సు ప్రారంభ సభలో ఓల్గా, ఉమామహేశ్వరి భృగు బండ, మామిడి హరికృష్ణ, పి. బాలభాస్కర్, కోయి కోటేశ్వరరావు, కె. లలిత పాల్గొంటారు. సి. మృణాళిని కీలకోపన్యాసం చేస్తారు. కాత్యాయని విద్మహే, కె. మధుజ్యోతి, చల్లపల్లి స్వరూపరాణి, తిరునగరి దేవకీదేవి, ఎం.ఎం. వినోదిని, కె.ఎన్. మల్లీశ్వరి తదితరులు పత్ర సమర్పణ చేస్తారు. కె. సజయ, జూపాక సుభద్ర, పద్మజా రమణ, జె. నీరజ, అనిశెట్టి రజిత వివిధ సాంకేతిక సభలకు అధ్యక్షత వహిస్తారు.
కె. సజయ, జె.నీరజ
Updated Date - 2023-09-11T00:11:49+05:30 IST