ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ వారం వివిధ కార్యక్రమాలు 16 10 2023

ABN, First Publish Date - 2023-10-16T01:36:38+05:30

‘సంచారం’ యాత్రా వ్యాసాలు, ‘రాళ్ళూ చిగురిస్తాయి’ కవితా సంపుటి, రాజాం రచయితల వేదిక సమావేశం, కవిసంధ్య సాహితీ పురస్కారాలు, విమలా జీవన సాఫల్య పురస్కారం...

‘సంచారం’ యాత్రా వ్యాసాలు,

అన్నవరం దేవేందర్‌ యాత్రా వ్యాసాల గ్రంథం ‘సంచారం’ ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 17 ఉ.10 గంటలకు కరీం నగర్‌లోని అద్విత ఇంటర్నేషనల్‌ స్కూ ల్‌లో జరుగుతుంది. సభలో నగునూరి శేఖర్‌, జీవి శ్యాంప్రసాద్‌ లాల్‌, బి.ఎస్‌. రాములు, స్వర్ణ కిలారి, గులాబీల మల్లారెడ్డి, గాజోజు నాగభూషణం, నంది శ్రీనివాస్‌, పొన్నం రవిచంద్ర తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 99492 47591

కూకట్ల తిరుపతి

‘రాళ్ళూ చిగురిస్తాయి’ కవితా సంపుటి

పొత్తూరి సుబ్బారావు కవితా సంపుటి ‘రాళ్ళూ చిగురిస్తాయి’ ఆవిష్కరణ సభ జివిఆర్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అక్టోబరు 20 సా.6గంటలకు శ్రీత్యాగరాయ గాన సభ, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో కె.వి. రమణాచారి, బైస దేవదాసు, వి.ఎస్‌. జనార్దనమూర్తి, వై. రామకృష్ణారావు, కొసరాజు తదితరులు పాల్గొంటారు.

గుడిబండి వెంకటరెడ్డి

రాజాం రచయితల వేదిక సమావేశం

రాజాం రచయితల వేదిక 105వ సమావేశం అక్టోబరు 22 ఉ.9.30 గంటలకు విజయనగరం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్‌ పాఠశాలలో పిళ్ళా తిరుపతిరావు అధ్యక్షతన జరుగుతుంది. సభలో ‘శమంతకమణి - బేతవోలు పద్యబాణి’ అంశంపై ఒమ్మి రమణమూర్తి ముఖ్యప్రసంగం చేస్తారు.

గార రంగనాథం

కవిసంధ్య సాహితీ పురస్కారాలు

‘కవిసంధ్య’ ప్రతీ ఏటా సాహిత్యంలో జీవన సాఫల్య కృషికి యిచ్చే ‘2023 శిఖామణి సాహితీ పురస్కారా’నికి దీర్ఘాశి విజయ్‌భాస్కర్‌; యువ కవులకు యిచ్చే ‘2023 శిఖామణి యువపుర స్కారా’నికి సుంకర గోపాల్‌ ఎంపిక అయ్యారు. పురస్కార ప్రదానం అక్టోబర్‌ 29 సా.5.30గంట లకు విశాఖ పౌర గ్రంథాలయంలో జరుగు తుంది. సభలో బేతవోలు రామబ్రహ్మం, మండలి బుద్ధప్రసాద్‌, మల్లాడి కృష్ణారావు, చందు సుబ్బా రావు, అట్టాడ అప్పలనాయుడు, చింతకింది శ్రీనివాస రావు తదితరులు పాల్గొంటారు.

దాట్ల దేవదానంరాజు

సాహితీ అవలోకన సదస్సు

భాషా సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ ‘సేవ’ ఆధ్వ ర్యంలో అక్షర తోరణం పేరిట అన్నవరం దేవేందర్‌ సాహితీ అవలోకనం సదస్సు అక్టోబర్‌ 17 నుంచి 20 వరకు 4 రోజుల పాటు ప్రతి సాయంత్రం ఏడు గంటలకు జూమ్‌, యూట్యూబ్‌ వేదికల్లో జరుగుతుంది. సదస్సులో రాచ పాళెం చంద్రశేఖర్‌ రెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, జూపాక సుభద్ర, సీతారాం, కాంచనపల్లి, కోయి కోటేశ్వరరావు, ఎస్‌. రఘు, ఫణి మాధవి కన్నోజు, తదితరులు ప్రసంగిస్తారు. వివరాలకు: 94926 66660.

కంచర్ల సుబ్బానాయుడు

విమలా జీవన సాఫల్య పురస్కారం

విమలా స్మారక జీవిత సాఫల్య పురస్కా రాన్ని రాచపాళెం చంద్రశేఖరరెడ్డి స్వీకరి స్తారు. పురస్కార ప్రదాన సభ అక్టోబరు 22 ఉ.10గంటలకు ఏసీ ఆడిటోరియం, ఎస్‌.ఎస్‌.బి.ఎన్‌ కాలేజ్‌, అనంతపురంలో జరుగుతుంది. సభలో డొక్కా మాణిక్య వరప్రసాద్‌, తూముచర్ల రాజారామ్‌, బండి నారాయణ స్వామి, కె. నిర్మలమ్మ, మేడిపల్లి రవికుమార్‌ తదితరులు పాల్గొంటారు.

శాంతి నారాయణ

ధ్రువం ఫౌండేషన్‌ పురస్కారాలు

ధ్రువం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆచార్య జీవియస్‌ సాహిత్య పురస్కారాన్ని బేతవోలు రామబ్రహ్మం, సుశీలా సుబ్రహ్మణ్యం పురస్కా రాన్ని కాత్యాయనీ విద్మహే స్వీకరిస్తారు. పుర స్కార ప్రదాన సభ అక్టోబరు 20 సా.6గం.లకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో కె.వి. రమణాచారి, వెంకట్‌ చంగవల్లి, ముక్తేవి భారతి, వాణీ భండారం తదితరులు పాల్గొంటారు.

శ్రీసౌమ్య వారణాసి

Updated Date - 2023-10-16T01:36:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising