ఈ వారం వివిధ కార్యక్రమాలు 17 09 2023
ABN, First Publish Date - 2023-09-18T00:17:39+05:30
‘వియ్యుక్క’ కథా సంపుటాలు, రెండు పుస్తకాల ఆవిష్కరణ, చాటువులు చమత్కారాలపై సదస్సు , ‘కబోది చేపల కబుర్లు’ కవిత్వం, టాల్ కథల పోటీ...
‘వియ్యుక్క’ కథా సంపుటాలు
అజ్ఞాత రచయిత్రులు తమ విప్లవాచ రణలో భాగంగా సుమారు నలభై ఏళ్ల విప్లవోద్యమ పరిణామాలకు ఇచ్చిన కాల్పనిక రూపం ‘వియ్యుక్క’ కథా సంపు టాలు. ఆరు సంపుటాల్లో మూడింటి ఆవిష్కరణ సెప్టెంబరు 24 సా.6గంటలకు దొడ్డి కొమరయ్య హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరా బాద్‌లో జరుగుతుంది. సభలో వరలక్ష్మి, విజయ భారతి, కళ్యాణి కుంజు, సునీత రాణి, కాత్యాయనీ విద్మహే, తాయమ్మ కరుణ, బి. అనూరాధ పాల్గొంటారు.
రివేరా
రెండు పుస్తకాల ఆవిష్కరణ
రాజాం రచయితల వేదిక ఆధ్వ ర్యంలో డి. రమేష్ పట్నాయక్ రచిం చిన ‘గతితార్కిక భౌతిక వాదం - ఒక పరిచయం’; ‘డేవిడ్ హార్వే: పెట్టుబడి - ఏడు ప్రాథమిక వైరుధ్యాలు - పరి చయం మరియు ఇతర వ్యాసాలు’ అనే పుస్తకాల ఆవిష్కరణ సెప్టెం బరు 24 ఉ.10 గంటలకు గార రంగ నాథం అధ్యక్షతన విజయనగరం జిల్లా, రాజాంలోని విద్యానికేతన్ పాఠశాలలో జరుగుతుంది. సభలో అట్టాడ అప్పలనాయుడు, కొప్పల భానుమూర్తి, రౌతు గణపతిరావు నాయుడు పాల్గొంటారు.
గార రంగనాథం
చాటువులు చమత్కారాలపై సదస్సు
ఏ.వి. ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళా శాల తెలుగుశాఖ, యాద శంకర మెమోరియల్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో ‘చాటువులు - చమత్కారాలు - సమాలోచన’ జాతీయ సదస్సు అక్టోబర్ చివరి వారంలో రెండు రోజులు నిర్వహించబడుతుంది. పరిశో ధన పత్రాలను కోరుతున్నాం. వీటిని సెప్టెంబర్ 30లోపు ఈమెయిల్: chatuvulu.chamatkaralu. 2023@gmail.com కు పంపాలి. మరిన్ని వివరాలకు: 9347225379, 9849071105.
వై. సత్యనారాయణ
‘కబోది చేపల కబుర్లు’ కవిత్వం
తెలుగు వెంకటేష్ కవితా సంపుటి ‘కబోది చేపల కబుర్లు’ ఆవిష్కరణ సభ సెప్టెంబరు 24 సా.6గంటలకు షోయబ్ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాదులో జరుగుతుంది.
కవిసంగమం
టాల్ కథల పోటీ
సారంగ వేదికగా ‘టాల్’ రేడియో నిర్వహిస్తున్న కథల పోటీకి సహాను భూతి, సాయం, సేవ వంటి మాన వతా విలువలను ప్రతిబింబించే కథ లను ఆహ్వానిస్తున్నాం. ప్రథమ, ద్వి తీయ, తృతీయ బహుమతులు వరు సగా: రూ.10వేలు, రూ.5వేలు, రూ.3 వేలు. ఇంకా రూ.2వేల చొప్పున ఐదు కన్సొలేషన్ బహుమతులు. బహుమతి పొందిన కథలను ‘సారంగ’ వెబ్ మేగజైన్‌లో ప్రచురిస్తారు. టాల్ రేడియో మాధ్యమాల్లో (రేడియో, పాడ్ కాస్ట్, యూట్యూబ్) కూడా ప్రసారం చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఏ మాధ్యమంలోనూ ప్రచురితం కాని, 1600 పదాలకు మించని కథలను అక్టోబర్ 15 లోగా ఈమెయిల్: info@talradio.orgకు పంపాలి. కేవలం హామీపత్రం మీద మాత్రమే రచయిత పేరు ఉండాలి.
టాల్ రేడియో
Updated Date - 2023-09-18T00:17:39+05:30 IST