ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS TET Special: అక్షాంశాలు- రేఖాంశాలు.. సాంఘిక శాస్త్రం నుంచి ఏం ప్రశ్నలు వస్తాయంటే..!

ABN, First Publish Date - 2023-08-24T12:25:30+05:30

భూమిని చక్కగా చూపించడానికి గ్లోబు ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. భూమి ఏ ఆకారంలో ఉంది? నేల, నీరు ఎలా ఉంటాయి వంటి అంశాలు గ్లోబు ద్వారా తెలుసుకోవచ్చు. భూమిపై ఉన్న ఖండాలు, మహా సముద్రాలు, దేశాలను గ్లోబు ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

భూమిని చక్కగా చూపించడానికి గ్లోబు ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. భూమి ఏ ఆకారంలో ఉంది? నేల, నీరు ఎలా ఉంటాయి వంటి అంశాలు గ్లోబు ద్వారా తెలుసుకోవచ్చు. భూమిపై ఉన్న ఖండాలు, మహా సముద్రాలు, దేశాలను గ్లోబు ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

భూమి - ఆకారం

భూమి ఒక బంతిలా గోళాకారంలో కనిపిస్తుంది. అయితే ఇది కచ్చితమైన గోళాకృతి లేదా గుండ్రంగా ఉండదు. ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద నొక్కుకు పోయి ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్టు ఉంటుంది. ఈ తేడా తక్కువగా ఉండటం వల్ల గ్లోబులు, పటాల్లో దీన్ని చూపించలేం. ప్రాచీన కాలంలోనే భారతదేశ, యూరప్‌ శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోళం మాదిరిగా ఉందని గమనించారు. ఇటలీకి చెందిన అన్వేషకుడు కొలంబస్‌ వంటి నావికులు సాధారణ శకం 1492 ప్రాంతంలో భారతదేశం చేరుకోవాలని యూరప్‌ నుంచి బయలుదేరారు.

  • మరి గోళాకారంగా ఉన్న భూమిపై మనుషులతోపాటు జంతువులు పడిపోకుండా ఎలా నిలబడతాయి? అనే సందేహం వస్తుంది. అయితే భూమి బలమైన అయస్కాంత కేంద్రం, దేన్నయినా తన వైపునకు ఆకర్షిస్తుంది. అందువల్ల పైకి ఎగిరేసిన వస్తువులు భూమిపై పడతాయి కానీ పైకి వెల్లవు.

  • భూమిపై భూభాగాలను, జల భాగాలను ఖండాలుగా, మహా సముద్రాలుగా విభజించారు. ఖండాలు ఏడు. అవి...ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూర్‌ప(ఐరోపా), ఆస్ట్రేలియా, అంటార్కిటికా. మహా సముద్రాలు ఐదు. అవి.. పసిఫిక్‌ మహా సముద్రం, అట్లాంటిక్‌ మహా సముద్రం, హిందూ మహా సముద్రం, ఆర్కిటిక్‌ మహా సముద్రం, అంటార్కిటిక్‌ మహా సముద్రం. భూమిపై ఉత్తర, దక్షిణ ధ్రువాలు మంచుతో కప్పి ఉంటాయి. ఆర్కిటిక్‌ మహా సముద్రం ఉత్తర ధ్రువంలో పూర్తిగా మంచుతో గడ్డ కట్టి ఉంటుంది. దక్షిణ ధ్రువంలో అంటార్కిటికా ఖండం మంచుతో కప్పి ఉంటుంది. ఉత్తర, దక్షిణ ధ్రువాల ద్వారా భూమి మధ్య నుంచి గీసే ఊహా రేఖను ‘అక్షం’ అంటారు. ఈ అక్షం చుట్టే భూమి భ్రమణం చేస్తుంది.

గ్లోబుపై రేఖలు

గ్లోబుపై నిలువుగా, అడ్డంగా కొన్ని ఊహా రేఖలు కనిపిస్తాయి. వీటిని అక్షాంశాలు, రేఖాంశాలు అంటారు. గ్లోబుపై అక్షాంశ, రేఖాంశాల కలయిక వల్ల ఏర్పడే గళ్లను గ్రిడ్‌ అంటారు. వీటిని ఉపయోగించి ఒక ప్రదేశం ఉనికి, శీతోష్ణస్థితి, ఆ ప్రదేశానికి ఏ విధంగా చేరుకోవచ్చునో తెలుసుకోవచ్చు.

ప్రాచీన గ్రంథాల్లో అక్షాంశ, రేఖాంశాల ప్రస్తాన

ప్రాచీన భారతీయ గ్రంథాల్లో మధ్యాహ్న రేఖల ప్రస్తావన ఉంది. ‘సూర్య సిద్ధాంత’ అనే ప్రాచీన భారతీయ గ్రంథం ఉజ్జయిని ద్వారా మధ్యాహ్న రేఖలు వెళ్తాయని నిర్ధారిస్తుంది. ఆర్యభట్ట ప్రకారం... శ్రీలంక, రోహ్‌తక్‌ ద్వారా మధ్యాహ్న రేఖలు పయనిస్తాయి. ధ్రువ నక్షత్రం వాలును కొలవడం ద్వారా ప్రాచీన భారతీయులు ఒక ప్రదేశం అక్షాంశాన్ని తెలుసుకునేవారు.

అక్షాంశాలు

భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు గీసిన ఊహా రేఖలను అక్షాంశాలు అంటారు. ఇవి వృత్తాలుగా ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపునకు సమాంతర వృత్తాలు ఉంటాయి. ఇంగ్లీ్‌షలో అక్షాంశాలను లాటిట్యూడ్‌ అంటారు. లాటిట్యూడో అనే లాటిన్‌ పదం నుంచి ఇది వచ్చింది. దీనికి సమానార్థం వెడల్పు.

  • 00 అక్షాంశం అన్నింటికంటే పొడవైంది. దీన్ని భూమధ్య రేఖగా పిలుస్తారు. అక్షాంశాలు 900 ఉత్తర(ఉత్తర ధ్రువం), 900 దక్షిణ(దక్షిణ ధ్రువం) వరకు విస్తరించి ఉంటాయి. అక్షాంశాలు ధ్రువాలకు చేరుకునేటప్పటికే బిందువులుగా మారిపోతాయి. భూమధ్య రేఖ గ్లోబును రెండు అర్ధభాగాలుగా చేస్తుంది. పై భాగాన్ని ఉత్తరార్థ గోళం అని, కింది భాగాన్ని దక్షిణార్థ గోళం అని అంటారు. ఆంగ్లంలో అర్ధ గోళాన్ని Hemisp-here అంటారు. Hemi అంటే సగ భాగం. భారతదేశం ఉత్తరార్థ గోళంలో ఉంటుంది. భూమిపై పడే సూర్యకాంతిని బట్టి కొన్ని ప్రత్యేక అక్షాంశాలు ఉన్నాయి. అవి... 231/20 దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ, 66 1/20 ఉత్తర అక్షాంశాలను ఆర్కిటిక్‌ వలయం, 66 1/20 దక్షిణ అక్షాంశాలను దక్షిణ ధ్రువం అని పిలుస్తారు. అక్షాంశాలు ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉంటాయి. కాబట్టి వీటిని సమాంతర రేఖలు అంటారు.

రేఖాంశాలు

ఒక ధ్రువం నుంచి మరో ధ్రువానికి కలుపుతూ గీసిన ఊహా రేఖలను రేఖాంశాలు అంటారు. ఇవన్నీ ఒకే రకమైన పొడవుతో ఉంటాయి. 00 రేఖాంశం ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌ సమీపంలోని థేమ్స్‌ నది గుండా వెథ్తుంది. దీన్ని గ్రీనీచ్‌ రేఖాంశం అని కూడా పిలుస్తారు. అనేక దేశాలు తమ దేశం ద్వారా వెళ్లే రేఖాంశాన్ని 00 రేఖాంశంగా పేర్కొన్నారు. అయితే ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లండ్‌ పాలించడం వల్ల అందరూ దాన్ని అనుసరించారు. రేఖాంశాన్ని ఇంగ్లీష్‌ లాం గిట్యూడ్‌ అంటారు. ఇది లాంగిట్యూడో అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. దీనికి సమాన అర్థం ‘పొడవు’. రేఖాంశాలు సమాన వృత్తాలు కావు. ఇవి ఒక ధ్రువం నుంచి మరో ధ్రువానికి అర్థ వృత్తాలు. 180 డిగ్రీల తూర్పు, పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దిన రేఖ అని పిలుస్తారు.

  • 180 డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు వైపునకు లెక్కించినప్పుడు తూర్పు రేఖాంశంగా, పశ్చిమం నుంచి లెక్కించినప్పుడు పశ్చిమ రేఖాంశంగా పిలుస్తారు. తూర్పు రేఖాంశాలతో తూర్పు అర్థ గోళం, పశ్చిమ రేఖాంశాలతో పశ్చిమ అర్థ గోళం ఏర్పడ్డాయి. రేఖాంశాలను మెరిడియన్లు, మధ్యాహ్న రేఖలు అంటారు. మెరిడియస్‌ అంటే మధ్యాహ్నం అని అర్థం. లాటిన్‌ పదం మెరిడియానస్‌ నుంచి మెరిడియన్‌ అనే పదం వచ్చింది.

రేఖాంశాలు - సమయం

భూమి స్థితి 10 రేఖాంశం మేర జరగడానికి నాలుగు నిమిషాలు పడుతుంది. ఇలా 150 మేర భూమి స్థితి మారడానికి ఒక గంట సమయం పడుతుంది. ఒక్కో రేఖాంశం వద్ద ఒక్కో సమయం అవుతుంది. కాబట్టి ప్రపంచం మొత్తాన్ని 24 కాల మండలాలు(టైమ్‌ జోన్స్‌)గా విభజించారు. ఒక్కో కాల మండలం ఇలా 150 రేఖాంశాల మేర ఉంటుంది. గ్రీనిచ్‌ మెరిడియన్‌ నుంచి తూర్పు వైపు వెళ్తుంటే సమయం కలపాలి. పశ్చిమం వైపునకు వెళ్తుంటే సమయం తీసెయ్యాలి. అంటే పడమర నుంచి తూర్పునకు ప్రయాణిస్తుంటే ప్రతి ఒక్క డిగ్రీకి నాలుగు నిమిషాలు కలపాలి. అయితే తూర్పు నుంచి పడమర వెళ్తుంటే ప్రతి డిగ్రీకి నాలుగు నిమిషాలు తీసెయ్యాలి.

-నూతిపల్లి బాలరాజ్‌

స్కూల్‌ అసిస్టెంట్‌

Updated Date - 2023-08-24T12:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising