ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Non-Biology Students: నాన్-బయాలజీ స్టూడెంట్స్ కూడా వైద్యులు కావొచ్చు.. ఎలాగో తెలుసా?

ABN, First Publish Date - 2023-11-23T15:53:44+05:30

కొందరు అవగాహన లేకుండా 10+2 తరగతుల్ని ఎంపీసీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) కోర్సుతో పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఆ తర్వాత.. ‘అయ్యో, బయాలజీ తీసుకొని ఉంటే డాక్టర్ అయ్యేవాళ్లం కదా’ అని విచారం వ్యక్తం చేస్తుంటారు.

New NMC Order: కొందరు అవగాహన లేకుండా 10+2 తరగతుల్ని ఎంపీసీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) కోర్సుతో పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఆ తర్వాత.. ‘అయ్యో, బయాలజీ తీసుకొని ఉంటే డాక్టర్ అయ్యేవాళ్లం కదా’ అని విచారం వ్యక్తం చేస్తుంటారు. అలాంటి విద్యార్థుల కోసం జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సరికొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఎంపీసీ కోర్సుతో 10+2 పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేసిన నాన్-బయాలజీ విద్యార్థులు.. ఇప్పటికీ వైద్యులు కావొచ్చని తెలిపింది. అయితే.. అందుకు అర్హత సాధించడం కోసం ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 స్థాయిలో అదనపు సబ్జెక్ట్‌గా జీవశాస్త్రం/బయోటెక్నాలజీ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.


NMC జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం.. 12వ తరగతిలో పాసైన తర్వాత కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ అదనపు సబ్జెక్టుల్ని పూర్తి చేసిన అభ్యర్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు గాను NEET-UG పరీక్షకు అనుమతి ఇవ్వబడుతుంది. అంతేకాదు.. ఈ అభ్యర్థులు విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులను అభ్యసించడానికి వారి అర్హతను నిర్ధారించే ధృవీకరణ పత్రాన్ని కూడా ఎన్ఎంసీ జారీ చేస్తుంది. జూన్ 14వ తేదీన ఈ అంశంపై చర్చలు జరిగాయని, నీట్-యూజీ అర్హత ప్రమాణాలను సడలించడంతోపాటు విదేశాల్లో మెడిసిన్ చదవడానికి అర్హత సర్టిఫికెట్ల జారీపై నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఎంసి పేర్కొంది. ఈ నిర్ణయం జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా ప్రవేశపెట్టబడిన సౌలభ్యానికి అనుగుణంగా ఉంటుంది.

ఇంతకుముందు.. అభ్యర్థులు MBBS లేదా BDS ప్రోగ్రామ్‌లకు అర్హత సాధించడానికి 10, 12వ తరగతుల్లో ప్రాక్టికల్స్‌తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ, ఇంగ్లీషులో రెండు సంవత్సరాల నిరంతర అధ్యయనం చేయవలసి ఉంటుంది. అది కూడా సాధారణ పాఠశాలల్లోనే! అంతేకాదు.. మునుపటి నిబంధనల ప్రకారం 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, విద్యార్థులు అదనపు సబ్జెక్టులను తీసుకోవడానికి అనుమతించబడరు. అయితే.. కొత్త NMC ఆర్డర్ ద్వారా ఈ పరిమితి ఎత్తివేయబడింది. 11, 12 తరగతుల్లో జీవశాస్త్రం లేదా బయోటెక్నాలజీ అవసరం లేకపోయినా.. వైద్య పాఠశాలను అభ్యసించాలనుకునే వ్యక్తులకు వైద్య పాఠశాలకు మార్గాన్ని అందిస్తుంది.

Updated Date - 2023-11-23T15:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising