ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Election results: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల కౌంటింగ్ ఆరంభ ట్రెండ్ ఇదే.. ఆధిక్యంలో ఉన్న పార్టీలివే..

ABN, First Publish Date - 2023-03-02T09:17:40+05:30

ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన త్రిపుర (Tripura), మేఘాలయ (Meghalaay), నాగాలాండ్ ఎన్నికల ఆరంభ ట్రెండ్స్‌పై ఒకింత స్పష్టత వచ్చింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అగర్తల: ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన త్రిపుర (Tripura), మేఘాలయ (Meghalaay), నాగాలాండ్ ఎన్నికల ఆరంభ ట్రెండ్స్‌పై ఒకింత స్పష్టత వచ్చింది. కౌంటింగ్ మొదలైన గంట తర్వాత అంటే ఉదయం 9 గంటలకు త్రిపురలో బీజేపీ 40 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక లెఫ్ట్ అలయెన్స్ 6 చోట్ల, టీఎంపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. మిగతా స్థానాలకు సంబంధించిన ఫలితాలు అందాల్సి ఉంది. త్రిపుర ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే పోస్టల్ ఓట్లు బీజేపీకి అనుకూలంగా పడ్డాయని స్పష్టమవుతోంది.

ఇక మేఘాలయలో ఎన్‌పీపీ (NPP) మొత్తం 27 చోట్ల ఆధిక్యంతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో, బీజేపీ 12 నియోజకవర్గాల్లో, ఇతరులు 13 చోట్ల ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు. కీలకమైన మరో రాష్ట్రం నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ (NDPP+) కూటమి 36 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఎన్‌పీఎఫ్ 7 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల ఇతరులు 13 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?

నాగాలాండ్‌లో అధికార ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. త్రిపురలో బీజేపీ తమ ప్రత్యర్థుల కంటే పూర్తి పైచేయి సాధింస్తుందని, మేఘాలయాలో గెలుపు దిశగా బీజేపీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. సోమవారంనాడు మేఘాలయ, నాగాలండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే ఎగ్టిట్ పోల్ ఫలితాలను న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయి.

మేఘాలయ

అరవై మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్‌పీపీ 21-26 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 8-13 సీట్లు, బీజేపీ 6-11 సీట్లు, కాంగ్రెస్ 3-6 సీట్లు గెలుచుకుంటాయని జీ-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్‌పీపీకి 18-24, కాంగ్రెస్ 6-12, బీజేపీ 4-8, యూడీపీ 8-12, టీఎంసీ 5-9 సీట్లు వస్తాయి. టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్‌పీపీ 18-26, ఏఐటీఎంసీ 8-14, యూడీపీ 8-14 బీజేపీ 3-6 సీట్లు గెలుస్తాయి.

నాగాలాండ్

60 సభ్యుల నాగాలాండ్ అసెంబ్లీలో ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి 38 నుంచి 48 సీట్లు, కాంగ్రెస్ 1-2 సీట్లు గెలుచుకుంటాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. జీ-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి 35 నుంచి 42 సీట్లు గెలుచుకుంటుంది. ఈటీజీ-టైమ్స్ నౌ పోల్ ప్రకారం ఎన్‌డీపపీ 27-33, బీజేపీ 12-16, ఎన్‌పీఎఫ్ 4-8 సీట్లు గెలుచుకుంటాయి.

త్రిపురలో...

త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 36 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుందని, లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి 6-11 సీట్లు వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టిప్ర మోతా పార్టీకి 9-16 సీట్లు వస్తాయని తెలిపింది. జీన్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం బీజేపీ-ఐపీఎఫ్‌టీ 29-36 సీట్లు గెలుచుకుంటాయి. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి 13-21 సీట్లు, టిప్ర మోతా పార్టీకి 11-16 సీట్లు వస్తాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల కౌటింగ్ మార్చి 2న జరుగుతుంది.

Updated Date - 2023-03-02T09:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!